తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral News | ఇదెక్కడి మాస్ రా మామ.. బ‌స్సులోనే మ‌ద్యం సేవించిన స్కూల్ విద్యార్థినులు

Viral News | ఇదెక్కడి మాస్ రా మామ.. బ‌స్సులోనే మ‌ద్యం సేవించిన స్కూల్ విద్యార్థినులు

HT Telugu Desk HT Telugu

24 March 2022, 15:12 IST

    • పాఠశాలకు వెళ్లే విద్యార్థులంటే.. ఎంత చక్కగా ఉండాలి. చదువుతోపాటు.. క్రమ శిక్షణ.. ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఉండాలి. కానీ విద్యార్థినులకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అది చూస్తే మీరు మాత్రం తప్పుకుండా షాక్ అవుతారు.
తమిళనాడులో బీర్ తాగిన యువతులు
తమిళనాడులో బీర్ తాగిన యువతులు

తమిళనాడులో బీర్ తాగిన యువతులు

తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలో కదులుతున్న బస్సులో పాఠశాల విద్యార్థులు మద్యం సేవిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే అమ్మాయిలు బీర్ తాగుతుండగా.. అక్కడే ఉన్న మరో విద్యార్థి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్ చేయడంతో.. వీడియో వైరల్ అయింది. అదే బస్సులో అబ్బాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిలు బీర్ తాగుతుండగా.. గట్టిగా అరుస్తున్నారు. 

విద్యార్థులంతా చెంగల్‌పట్టులోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారుగా భావిస్తున్నారు. విద్యార్థులు పాఠశాల యూనిఫారంలో తిరుకఝుకుండ్రం నుండి తాచూర్‌కు బస్సులో ఉన్నారు. ఈ ఘటన అధికారులు దృష్టికి వెళ్లింది. విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఇది పాఠశాల బయట జరిగింది కాబట్టి.. పోలీసులు దాని గురించి విచారణ జరుపుతున్నారని తెలిపారు. అది ముగిసిన తర్వాత, మేం.. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గతంలోనూ ఇలాంటి ఘటనే..

గతంలోనూ తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది.. ముగ్గురు కాలేజీ విద్యార్థినులు తమ స్నేహితురాలు పుట్టిన రోజులు వేడుకలను.. పుట్టినరోజు వేడుకలను ఆ అమ్మాయి ఇంట్లో తమ తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా జరుపుకొంటున్నారు. అయితే పుట్టిన రోజు జరుపుకొంటున్న.. అమ్మాయి మాత్రం యూనిఫామ్ లో లేదు. మిగతా ముగ్గురు అమ్మాయిలు.. స్కూల్ యూనిఫామ్ లో ఉంది. అయితే యూనిఫామ్ ధరించి మద్యం.. తాగడంతో కాలేజీ యాజమాన్యం వారికి ఝలక్ ఇచ్చింది. కళాశాలలో అడుగుపెట్టనివ్వమని.. ప్రిన్సిపాల్ చెప్పారు.

టాపిక్

తదుపరి వ్యాసం