తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  World's ‘Tallest’ Shiva Statue In Rajastan: 369 అడుగుల మహా దేవుడి మహా విగ్రహం

World's ‘Tallest’ Shiva statue in Rajastan: 369 అడుగుల మహా దేవుడి మహా విగ్రహం

HT Telugu Desk HT Telugu

29 October 2022, 16:29 IST

google News
  • World's ‘Tallest’ Shiva statue in Rajastan: మహా దేవుడి అద్భుత విగ్రహం రాజస్తాన్ లో రూపుదిద్దుకుంది. 369 అడుగుల ఎత్తైన ఈ ‘విశ్వాస స్వరూపం’ విగ్రహాన్ని రాజస్తాన్లోని నాథ్ ద్వారా పట్టణంలో ఏర్పాటు చేవారు. 

     

రాజస్తాన్ లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం
రాజస్తాన్ లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం

రాజస్తాన్ లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం

World's ‘Tallest’ Shiva statue in Rajastan: రాజస్తాన్ లోని రాజ్ సమంద్ జిల్లాలో ఉన్న నాథ్ ధ్వారా పట్టణంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద శివుడి విగ్రహంగా దీన్ని భావిస్తున్నారు. రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, స్పీకర్ సీపీ జోషి సమక్షంలో ఆధ్యాత్మిక వత్త మొరారీ బాపు శనివారం దీన్ని ఆవిష్కరిస్తారు.

World's ‘Tallest’ Shiva statue in Rajastan: ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం

ఈ మహాదేవుడి మహా విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైనదిగా భావిస్తున్నారు. ఇది ఉదయపూర్ కు 45 కిమీల దూరంలో ఉంది. ఈ విగ్రహ నిర్మాణానికి తత్ పాదం సంస్థాన్ సహకరించింది. విగ్రహావిష్కరణ అనంతరం, శనివారం నుంచి 9 రోజుల పాటు పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని సంస్థాన్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ చైర్మన్ మదన్ పాలివాల్ వెల్లడించారు. ఆధ్యాత్మకి వేత్త మొరారి బాపు కూడా రామకథను వినిపిస్తారని తెలిపారు. ఈ విగ్రహం వల్ల ఈ ప్రాంతానికి మతపరమైన పర్యాటక ప్రాధాన్యత లభిస్తుందని మదన్ పాలివాల్ వివరించారు.

World's ‘Tallest’ Shiva statue in Rajastan: 17 ఎకరాల స్థలంలో..

ఎత్తైన గుట్టపై దాదాపు 17 ఎకరాల స్థలంలో(51 bighas) ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం శివుడు కూర్చుని ధ్యానం చేస్తున్నవిధంగా ఉంటుంది. దాదాపు 20 కిమీల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. రాత్రి సమయంలో కూడా కనిపించలా ప్రత్యేక లైట్లతో ఈ విగ్రహాన్ని అలంకరించారు. ఇందులో భక్తులు ధ్యానం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. అలాగే లిఫ్ట్స్, మెట్లు వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు.

World's ‘Tallest’ Shiva statue in Rajastan: 3 వేల టన్నుల ఉక్కు

ఈ విగ్రహం తయారీకి 3 వేల టన్నుల ఉక్కు, ఇనుమును, 2.5 క్యూబిక్ టన్నుల కాంక్రీట్ ను వాడారు. ఈ విగ్రహం రూపొందించడానికి సుమారు 10 ఏళ్ల సమయం పట్టింది. గంటకు 250 కిమీల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా ఈ విగ్రహాన్ని రూపొందించారు. కనీసం 250 ఏళ్ల పాటు ఈ విగ్రహం చెక్కుచెదరదని సంస్థాన్ నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రాంతంలో బంగీ జంపింగ్, గో కార్ట్, అడ్వెంచర్ పార్క్, జంగిల్ కేఫ్, జిప్ లైన్ తదితరాలకు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2012లో జరిగిన విగ్రహం శంకుస్థాపన కూడా నాటి ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సమక్షంలోనే జరగడం విశేషం.

తదుపరి వ్యాసం