Swara Bhasker joins Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో మరో సెలబ్రిటీ..
08 January 2024, 22:02 IST
Swara Bhasker joins Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త ‘భారత్ జోడో యాత్ర’లో మరో సెలబ్రిటీ జాయిన్ అయ్యారు. ఇప్పటివరకు పూజా భట్, అమోల్ పాలేకర్ తదితర సెలెబ్రిటీలు ఈ యాత్రలో పాల్గొని రాహుల్ తో కలిసి నడవగా, తాజాగా ఆ జాబితాలోకి నటి స్వర భాస్కర్ చేరారు.
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి గులాబీ పూలు అందిస్తున్న స్వర భాస్కర్
Swara Bhasker joins Bharat Jodo Yatra: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన దేశవ్యాప్త పాద యాత్ర ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఉజ్జయిన్ లోని మహాకాల్ ఆలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు చేశారు.
Swara Bhasker joins Bharat Jodo Yatra: యాత్రలో నటి స్వర భాస్కర్
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ గురువారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిన్ లో రాహుల్ గాంధీతో కలిసి ఆమె నడిచారు. ఈ సందర్భంగా రాహుల్ తో కాసేపు ముచ్చటించారు. అనంతరం, యాత్రలో రాహుల్ తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. విద్వేషాలను తుదముట్టించే లక్ష్యంతో చేస్తున్న ఈ యాత్రలో అందరూ పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
Swara Bhasker joins Bharat Jodo Yatra: గులాబీ పుష్ప గుచ్ఛం
భారత్ జోడో యాత్రలో పాల్గొన్న స్వర భాస్కర్ రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ గాంధీలోని ప్రేమ, నిబద్ధత, నిజాయితీ స్ఫూర్తిదాయకమన్నారు. యాత్రలో రాహుల్ తో కలిసి నడుస్తూ దిగిన పలు ఫొటోలను షేర్ చేసుకున్నారు. యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహం మరవలేనిదన్నారు. రాహుల్ తో కలిసి నడుస్తున్న సమయంలో పక్కనున్న ఒక వ్యక్తి అందించిన గులాబీ పూల బొకేను ఆమె రాహుల్ కు అందించారు. సింపుల్ గా ఉన్న వైట్ డ్రెస్, స్నీకర్స్ తో ఆమె ఈ యాత్రలో పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన ‘జహా చార్ యార్’ అనే సినిమాలో ఆమె నటించారు.
Bharat Jodo Yatra: 83వ రోజు..
సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర గురువారానికి 83వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో యాత్ర ముగిసింది. ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో కొనసాగుతుంది. డిసెంబర్ 4వ తేదీన మధ్య ప్రదేశ్ నుంచి రాజస్తాన్ లోకి అడుగు పెడ్తుంది. వచ్చే సంవత్సరం కశ్మీర్ లో భారీ బహిరంగ సభతో ముగుస్తుంది.