తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mla Poaching Case: ఆ కేసు పరిష్కరించేంత వరకు దర్యాప్తు వద్దన్న సుప్రీం

MLA Poaching Case: ఆ కేసు పరిష్కరించేంత వరకు దర్యాప్తు వద్దన్న సుప్రీం

HT Telugu Desk HT Telugu

13 March 2023, 16:52 IST

google News
    • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ పోలీసుల అప్పీలును తాము పరిష్కరించేంత వరకు సీబీఐ దర్యాప్తు వద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది.
భారత సర్వోన్నత న్యాయస్థానం
భారత సర్వోన్నత న్యాయస్థానం (HT_PRINT)

భారత సర్వోన్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ, మార్చి 13: హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర పోలీసులు చేసిన అప్పీల్‌ను పరిష్కరించే వరకు తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును చేపట్టవద్దని సుప్రీంకోర్టు సోమవారం సీబీఐని ఆదేశించింది.  న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తదుపరి విచారణను జూలై మాసానికి వాయిదా వేసింది. కాగా, దర్యాప్తునకు సంబంధించిన పత్రాలను సీబీఐకి అందజేయలేదని తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 120-బి, 171-బి ఆర్/డబ్ల్యూ 171-ఇ 506 ఆర్/డబ్ల్యూ 34 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రామచంద్రభారతి, భారతీయ జనతా పార్టీకి చెందిన నందకుమార్ తనను కలిసి.. బీజేపీలో చేరితే రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పైలట్ రెడ్డి ఆరోపించారు.

బీజేపీలో చేరకపోతే తనపై క్రిమినల్ కేసులు పెడతామని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)లతో దాడులు చేయిస్తామని బెదిరించారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆరోపించారు.

ఈ ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. 

తదుపరి వ్యాసం