Stock market today : ఫ్లాట్‌గా దేశీయ సూచీలు.. సెన్సెక్స్ 100ప్లస్
23 June 2022, 9:22 IST
- Stock market today : దేశీయ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇక ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
స్టాక్ మార్కెట్ ఇండియా
Stock market today : దేశీయ సూచీలు గురువారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 108పాయింట్ల లాభంతో 51,931 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 13 పాయింట్లు వృద్ధి చెంది 15,427 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇండియా స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలనే చూశాయి. 700పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. 51,823 వద్ద స్థిరపడింది. 225 పాయింట్ల పతనంతో 15,413 వద్ద ముగిసింది నిఫ్టీ. కాగా గురువారం ట్రేడింగ్ సెషన్‌ను సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా.. 51,927- 15,452 వద్ద మొదలుపెట్టాయి.
ఎప్పటిలాగే.. మార్కెట్లను ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి.
లాభాలు.. నష్టాలు..
ఎయిర్టెల్, విప్రో, అల్ట్రాటెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టైటాన్, పవర్‌గ్రిడ్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
అమెరికా మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లోనే స్థిరపడ్డాయి. తొలుత లాభాల్లో ఉన్నప్పటికీ.. మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. డౌ జోన్స్ 0.15శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.15శాతం, ఎస్ అండ్ పీ 500 0.13శాతం మేర నష్టపోయాయి.
ఆసియా సూచీలు మాత్రం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.69శాతం లాభాల్లో ఉంది. సౌత్ కొరియా కాస్పి 0.64శాతం, ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.48శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.
చమురు ధరలు..
అంతర్జాతీయంగా చమురు ధరలు 2శాతం పడ్డాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర 103.80డాలర్లుగా ఉంది.
ఎఫ్ఐఐ.. డీఐఐ..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు.. రూ. 2,920.61కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. కాగా.. అదే సమయంలో రూ. 1,859కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.