తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ssc Mts Results : ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఫలితాల వెల్లడి

SSC MTS results : ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఫలితాల వెల్లడి

HT Telugu Desk HT Telugu

08 January 2024, 18:31 IST

google News
  • ఎంటీఎస్ 2023 ఫలితాలను స్టాఫ్ సెలెక్షన్  కమిషన్ శనివారం వెల్లడించింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను ఎస్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.nic.in. లో చెక్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మే, జూన్ నెలల్లో రెండు ఫేజ్ ల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్), హవల్దార్ (సీబీఐసీ, సీబీఎన్) ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలను నిర్వహించింది. మే 2 వ తేదీ నుంచి మే 19 వరకు ఫేజ్ 1, జూన్ 13 నుంచి జూన్ 20 వరకు ఫేజ్ 2 పరీక్షలను నిర్వహించింది. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఈ కంప్యూటర్ బేస్డ్ పరీక్షను ఎస్ఎస్సీ నిర్వహించింది.

ఫలితాల వెల్లడి..

ఎంటీఎస్, హవల్దార్ 2023 పరీక్షల ఫలితాలను శనివారం ఎస్ఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను ఎస్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.nic.in. లో చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలో హవల్దార్ పోస్ట్ లకు మొత్తం 3015 మంది ఉత్తీర్ణులయ్యారు. వారు శారీరక ధారుడ్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

How to check marks: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

  • ఎస్ఎస్సీ ఎంటీఎస్, హవల్దార్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రిజల్ట్ ను చెక్ చేసుకోవడానికి ముందుగా..
  • ఎస్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.nic.in. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే రిజల్ట్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
  • SSC MTS results 2023 లింక్ పై క్లిక్ చేయాలి
  • కొత్త పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.
  • అందులో ఉత్తీర్ణులైన వారి హాల్ టికెట్ నంబర్స్ ఉంటాయి.
  • హాల్ టికెట్ నంబర్ తో రిజల్ట్ చెక్ చేసుకోండి.
  • భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ పేజీని డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి.

తదుపరి వ్యాసం