SSC CHSL 2022 tier 1 results: ఎస్ఎస్సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ టయర్ 1 ఫలితాల వెల్లడి
19 May 2023, 21:53 IST
- SSC results: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) ఎగ్జామినేషన్ 2022 టయర్ 1 (Combined Higher Secondary Level Examination) ఫలితాలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (Staff Selection Commission SSC) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాలను అభ్యర్థులు ssc.nic.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
SSC CHSL 2022 tier 1 results: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) ఎగ్జామినేషన్ 2022 టయర్ 1 (Combined Higher Secondary (10+2) Level Examination) ఫలితాలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (Staff Selection Commission SSC) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాలను అభ్యర్థులు ssc.nic.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు.
SSC CHSL 2022 tier 1 results: జూన్ 26న టయర్ II పరీక్ష
ఈ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) ఎగ్జామినేషన్ 2022 టయర్ 1 () ను ఎస్ఎస్సీ మార్చి 9 నుంచి మార్చి 21 వరకు నిర్వహించింది. ఇది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. ఈ పరీక్షలో ఉత్తీర్ణులై షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు టయర్ 2 (Tier-II) పరీక్షకు హాజరవాల్సి ఉంటుంది. మొత్తం 40224 అభ్యర్థులు టయర్ 2 (Tier-II) పరీక్ష రాయడానికి ఉత్తీర్ణత సాధించారు. ఈ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) ఎగ్జామినేషన్ 2022 టయర్ II (Combined Higher Secondary (10+2) Level Examination) పరీక్ష 2023 జూన్ 26వ తేదీన జరుగుతుంది.
SSC CHSL 2022 tier 1 results: రిజల్ట్ చెక్ చేసుకోవడం ఎలా?
- ఎస్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ ssc.nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- Combined Higher Secondary (10+2) Level Examination result లింక్ పై క్లిక్ చేయాలి.
- కొత్త పీడీఎఫ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
- రోల్ నెంబర్ ఆధారంగా ఆ పీడీఎఫ్ లో రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు