SSC CGL 2023: గెట్ రెడీ: ఎస్ఎస్‍సీ సీజీఎల్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేస్తోంది: విడుదల తేదీ ఇదే!
14 March 2023, 14:21 IST
- SSC CGL 2023 Notification: ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ 2023 నోటిఫికేషన్ ఏప్రిల్ 1వ తేదీన విడుదల కానుందనే సమాచారం బయటికి వచ్చింది. పూర్తి వివరాలు ఇవే.
SSC CGL 2023: గెట్ రెడీ: ఎస్ఎస్‍సీ సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చేస్తోంది
SSC CGL 2023 Notification : సీజీఎల్ నోటిఫికేషన్‍ను విడుదల చేసేందుకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (Staff Selections Commission - SSC) సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి సీజీఎల్ (SSC CGL) పరీక్షను ఎస్‍ఎస్‍సీ నిర్వహించనుంది. ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ 2023 నోటిఫికేషన్ (SSC CGL 2023 Notification)ను ఏప్రిల్ 1వ తేదీన ఎస్‍ఎస్‍సీ విడుదల చేయనుందని తెలుస్తోంది. అదే రోజు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కానుందనే సమాచారం వెల్లడైంది.
దరఖాస్తుకు నెల గడువు!
SSC CGL 2023 Notification: ఏప్రిల్ 1వ తేదీన ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ 2023 నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు అప్లికేషన్స్ (SSC CGL Applications) ప్రక్రియ మొదలుకానుంది. మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య తదితర వివరాలు నోటిఫికేషన్‍లో వివరంగా ఉంటాయి. అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్‍ను క్షుణ్ణంగా చదవాలి. గ్రాడ్యుయేషన్ పూర్తయిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎస్‍ఎస్‍సీ అధికారిక వెబ్‍సైట్ ssc.nic.in లో అందుబాటులో ఉంటుంది. ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ 2023 పరీక్ష ఈ ఏడాది జూన్, జూలై మధ్య జరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
SSC CGL 2023 Notification: ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ పరీక్ష (SSC CGL Exam 2023) ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ, విభాగాలు, సంస్థల్లో ఉద్యోగ ఖాళీలను ఎస్‍ఎస్‍సీ భర్తీ చేస్తుంది. ఈ ఏడాదికి నోటిఫికేషన్‍లో కూడా వేల సంఖ్యలోనే సీజీఎల్ పోస్టులు ఉంటాయని అంచనాలు వెలువడుతున్నాయి.
ఎలా అప్లయ్ చేసుకోవాలి
SSC CGL 2023 Apply: ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ssc.nic.inలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్‍సైట్ ssc.nic.inలోకి వెళ్లాలి.
- అనంతరం లాగిన్ అయ్యేందుకు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‍వర్డ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి.
- లాగిన్ అయ్యాక.. ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ అప్లై లింక్‍పై క్లిక్ చేయాలి. అనంతరం అప్లికేషన్ ఫామ్‍లో అన్ని వివరాలను ఎంటర్ చేయాలి.
- స్కాన్ చేసిన ఫొటోలు, సంతకం, అవసరమైన ఇతర సర్టిఫికేట్లు అప్‍లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరగా ఒకసారి అప్లికేషన్‍లో ఎంటర్ చేసుకున్న వివరాలను రివ్యూ చేసుకున్నాక అంతా సరిగా ఉంటే సబ్మిట్ బటన్‍పై క్లిక్ చేయాలి.
- చివరగా ఫీజు చెల్లించాలి. ఆన్‍లైన్ లేదా ఆఫ్‍లైన్ పద్ధతుల్లో ఫీజు చెల్లించవచ్చు.