Inspiring: దివ్యాంగుడి సంకల్పం: ‘ఐఏఎస్’ కావాలన్నకలను నెరవేర్చుకునేందుకు సమోసాలు అమ్ముతూ..
20 April 2023, 12:51 IST
- Inspiring: ఐఏఎస్ కావాలన్న కలను నెరవేర్చుకునేందుకు ఓ దివ్యాంగుడు సమోసాలు అమ్ముతున్నారు. వ్యాపారంతో వచ్చిన డబ్బుతో చదువు కొనసాగిస్తున్నారు.
Inspiring: దివ్యాంగుడి సంకల్పం: ‘ఏఐఎస్’ కావాలన్నకలను నెరవేర్చుకునేందుకు సమోసాలు అమ్ముతూ.. (Photo: Instagram/@GauravWasan)
Inspiring: తమ జీవనం సాగించేందుకు, కలలను నెరవేర్చుకునేందుకు కొందరు చాలా కష్టాలు పడుతుంటారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తుంటారు. ఇలాంటి కొన్ని స్టోరీలు హృదయానికి కాస్త కష్టంగా అనిపించినా.. స్ఫూర్తిని కలిగిస్తుంటాయి. అలాంటిదే ఈ స్టోరీ కూడా. నాగ్‍పూర్‍కు చెందిన ఓ దివ్యాంగుడు.. ఐఏఎస్ అధికారి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తన చదువుకు కావాల్సిన డబ్బును సమోసాలు అమ్ముతూ సంపాదిస్తున్నారు. ఆయన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గౌరవ్ వాసన్ అనే ఓ వ్లాగర్ ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఓ దివ్యాంగుడు వీల్‍చైర్‌లో కూర్చొని సమోసాలు అమ్ముతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆ సమోసాలు అమ్ముతున్న వ్యక్తి పేరు సూరజ్ (Suraj). యూనివర్సిటీ ఆఫ్ నాగ్‍పూర్ నుంచి ఆయన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు.
ఏ జాబ్ రాలేదు
“నేను ఏ కంపెనీ నుంచి జాబ్ పొందలేదు. అందుకే ఈ సమోసా షాప్‍ను ప్రారంభించాను” అని ఆ వీడియోలో సూరజ్ అన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు సూరజ్ సమోసాలు అమ్ముతూ కష్టపడుతున్నారని వ్లాగర్ గౌరవ్ వాసన్ పేర్కొన్నారు. ఆయనకు సాయం చేయాలని కోరారు.
ఏప్రిల్ 10వ తేదీన గౌరవ్ ఈ వీడియో పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటి వరకు ఇన్‍స్టాగ్రామ్‍లో ఈ వీడియోకు సుమారు 40వేల లైక్‍లు వచ్చాయి. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. సూరజ్ ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారని రాసుకొస్తున్నారు.
“ఆయనను చూసి చాలా మంది నేర్చుకోవాలి. అన్నీ ఉన్నా కొందరు సాకులు చెబుతుంటారు” అని ఓ యూజర్ కామెంట్ చేశారు. శారీరక వైకల్వం ఆయన స్వతంత్రాన్ని, లక్ష్యాన్ని నిలువరించలేవని, స్ఫూర్తివంతం అని మరో యూజర్ రాసుకొచ్చారు.