తెలుగు న్యూస్  /  National International  /  Skoda Drives In Kushaq Monte Carlo Edition With Starting Price Of <Span Class='webrupee'>₹</span>15.99 Lakh

స్కోడా మిడ్ సైజ్ ఎస్‌యూవీ కుషాక్ మాంటే కార్లో ఎడిషన్ విడుదల

HT Telugu Desk HT Telugu

09 May 2022, 16:01 IST

  • న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా సోమవారం తన మిడిల్ సెగ్మెంట్ ఎస్‌యువీ కుషాక్‌లో మోంటే కార్లో ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.99 లక్షల నుండి రూ. 19.49 లక్షల మధ్య ఉంది.

కుషాక్ మాంటేకార్లో ఎడిషన్
కుషాక్ మాంటేకార్లో ఎడిషన్ (skoda)

కుషాక్ మాంటేకార్లో ఎడిషన్

కుషాక్ మాంటే కార్లో సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రిమ్ 1 లీటర్ పెట్రోల్ వెర్షన్ ఇంజన్ ధర రూ. 15.99 లక్షలు కాగా, ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 17.69 లక్షలు.

ట్రెండింగ్ వార్తలు

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

అదేవిధంగా 1.5 లీటర్ ఇంజన్‌తో కూడిన మోంటే కార్లో ఎడిషన్ మాన్యువల్ ట్రిమ్ ధర రూ. 17.89 లక్షలు కాగా, సెవెన్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రిమ్‌లో హైఎండ్ రేంజ్ రూ. 19.49 లక్షలుగా ఉంది.

స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ ‘మాంటే కార్లో ఎడిషన్ ప్రత్యేకమైన వీల్స్, సీట్లు, బ్లాక్ ఇంటీరియర్స్‌తో స్పోర్టినెస్ కలిగి ఉంది.’ అని చెప్పారు. స్కోడా ప్రస్తుతం దేశీయ విపణిలో నెలకు దాదాపు 2,500-3,000 యూనిట్ల మధ్య తరహా ఎస్‌యూవీని విక్రయిస్తోంది.

కుషాక్ మోంటే కార్లో 'టోర్నడో రెడ్', 'క్యాండీ వైట్' రంగులలో వస్తోంది. కుషాక్ మాంటే కార్లో 1.0 టీఎస్ఐ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఇటీవలే విడుదల చేసిన మోడల్ స్లావియా నెలకు దాదాపు 2,500-3,000 యూనిట్ల విక్రయాలతో మెరుగైన పనితీరు కనబరుస్తోందని హోలిస్ పేర్కొన్నారు.

‘ప్రారంభించిన రెండో నెలలోనే మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో నంబర్ వన్‌గా నిలిచాం. అదే విధంగా కుషాక్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మూడవ స్థానంలో ఉంది. కాబట్టి రెండు కార్లు బాగా రాణిస్తున్నాయి..’ అని తెలిపారు. 

టాపిక్