తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nepal Earthquake: నేపాల్‌ను వణికించిన భారీ భూకంపం.. ఆరుగురు మృతి

Nepal Earthquake: నేపాల్‌ను వణికించిన భారీ భూకంపం.. ఆరుగురు మృతి

HT Telugu Desk HT Telugu

09 November 2022, 7:58 IST

google News
  • నేపాల్ లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూప్రకంపనల దాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఈ ప్రకంపనాలు ఢిల్లీ పరిసర ప్రాంతాలను తాకాయి.

నేపాల్ లో భూకంపం
నేపాల్ లో భూకంపం (ANI)

నేపాల్ లో భూకంపం

Earthquake in Nepal: భూకంపం ధాటికి నేపాల్ వణికిపోయింది. బుధవారం ఉదయం(01.57 సమయంలో) భూప్రకపంనలు సంభవించటంతో.. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రత 6.6 గా నమోదైంది. ఈ మేరకు ఆ దేశ అధికారులు వివరాలు వెల్లడించారు.

భూకంపం దాటికి మరో ఐదు మంత్రి తీవ్రంగా గాయపడ్డారని, వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు దోతి జిల్లా ప్రధాన అధికారి కల్పనా శ్రేష్ట.. ANIతో చెప్పారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమైనట్లు వెల్లడించారు. ఆస్తినష్టం కూడా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు నేపాల్ ఆర్మీ అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా రెండు సార్లు భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

delhi earthquake: మరోవైపు ఈ భూప్రకంపనలు ఢిల్లీని కూడా తాకాయి. ,పిథోరాఘడ్, గురుగ్రామ్, లఖ్నో, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు. నేపాల్ కేంద్రంగా సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(National Center forSeismology)వెల్లడించింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి.

తదుపరి వ్యాసం