Sitaram Yechury | సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి
10 April 2022, 15:29 IST
- భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మళ్లీ ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంది. కొత్త సెంట్రల్ కమిటీని సైతం ప్రకటించారు. సెంట్రల్ కంట్రోల్ కమిషన్ ఛైర్ పర్సన్ గా ఏకే పద్మనాబన్ నియమితులయ్యారు.
సీతారాం ఏచూరి(ఫైల్ ఫొటో)
సీతారాం ఏచూరి(ఫైల్ ఫొటో)
సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శింగా.. సీతారాం ఏచూరిని నియమించారు. కేరళలోని కన్నూరులో సీపీఎం 23వ అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. పార్టీ ప్రముఖులంతా కలిసి ఏకగ్రీవంగా ఏచూరిని ఎన్నుకున్నారు. సీతారాం ఏచూరి ప్రధాన కార్యదర్శిగా చేయడం ఇది మూడోసారి.
1974లో ఎస్‌ఎఫ్‌ఐలో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం మెుదలైంది. ఆ తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్)లో చేరారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. అనంతరం అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత.. సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు.