Shraddha Murder Case: జైళ్లో ఒంటరిగా చెస్ ఆడుకుంటున్న తెలివైన క్రిమినల్ ఆఫ్తాబ్
02 December 2022, 19:44 IST
Shraddha Murder Case: లివిన్ పార్ట్ నర్ శ్రద్ధ వాకర్ ను దారుణంగా హతమార్చి, ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫ్తాబ్ పూనావాలా ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైళ్లో ఉన్నాడు.
ఆఫ్తాబ్ పూనావాలా (మాస్క్ పెట్టుకున్న వ్యక్తి)
Shraddha Murder Case: ఆఫ్తాబ్ పై గురువారం ఢిల్లీ పోలీసులు నార్కొ టెస్ట్ చేశారు. నేరం చేయడానికి కారణం, నేరం చేసిన విధానం, తరువాత మృతదేహాన్ని ఏం చేశాడు?, వాడిన ఆయుధాలు, కుటుంబ సభ్యుల సమాచారం వంటి ప్రశ్నలను నార్కొ టెస్ట్ సందర్భంగా ఆఫ్తాబ్ ను అడిగినట్లు సమాచారం.
Shraddha Murder Case: అవే సమాధానాలు..
కాగా, నార్కొ టెస్ట్ తో పోలీసులు కొత్త విషయాలనేవీ తెలుసుకోలేదని, పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో ఇచ్చిన సమాధానాలనే నార్కొ టెస్ట్ సమయంలో కూడా ఆఫ్తాబ్(Aaftab) ఇచ్చాడని పోలీసు వర్గాలు తెలిపాయి. పాలిగ్రాఫ్ పరీక్ష, నార్కొ టెస్ట్ ల సమయంలో ఆఫ్తాబ్ ఇచ్చిన సమాధానాలను శుక్రవారం విశ్లేషించనున్నారు.
Aaftab playing Chess alone: జైల్లో ఒంటరిగా చెస్
తిహార్ జైల్లోని సెల్ లో ఆఫ్తాబ్ ఒంటరిగా చెస్ ఆడుకుంటున్నాడని జైలు వర్గాలు తెలిపాయి. సెల్ లో ఆఫ్తాబ్ తో పాటు మరో ఇద్దరు ఖైదీలను ఉంచారు. వారు దొంగతనం కేసులో నిందితులు. వారితో జైలు గదిలో ఆఫ్తాబ్(Aaftab) చెస్ ఆడుతున్నాడని, చాలా సార్లు ఒక్కడే ఆడుకుంటున్నాడని జైైలు వర్గాలు వెల్లడించాయి. ఆఫ్తాబ్ మంచి చెస్ ప్లేయరని ఆయన ఆట తీరుతో అర్థమవుతోందన్నారు. కొత్త ఎత్తులతో రెండు వైపులా ఒక్కడే చదరంగం ఆడుతున్నాడని వివరించారు.
Aaftab intelligent criminal: తెలివైన క్రిమినల్
ఆఫ్తాబ్ ను చాలా తెలివైన క్రిమినల్ అని ఈ కేసు దర్యాప్తులో పాలు పంచుకుంటున్న ఒక పోలీసు అధికారి వివరించారు. ‘ఈ కేసు విచారణ మేం అనుకున్నట్లు నడుస్తోందా? లేక నిందితుడైన ఆఫ్తాబ్(Aaftab) కోరుకుంటున్నట్లు నడుస్తోందా? అని ఒక్కోసారి అనుమానమొస్తుంది’ అని ఆ అధికారి వ్యాఖ్యానించారు. ఆఫ్తాబ్ విచారణకు సహకరిస్తున్నట్లుగా కనిపిస్తూనే, ముందే ప్లాన్ చేసుకున్న వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. అందువల్లనే ఇప్పటికీ, ఒక స్పష్టమైన ఫలితం కూడా లభించలేదని వివరించారు.