తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ugc On Ug Admissions: యూజీ అడ్మిషన్లపై యూజీసీ కీలక ప్రకటన

UGC on UG Admissions: యూజీ అడ్మిషన్లపై యూజీసీ కీలక ప్రకటన

HT Telugu Desk HT Telugu

13 July 2022, 17:36 IST

google News
    • UGC on UG admissions deadline: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లపై యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక ప్రకటన చేసింది.
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (HT_PRINT)

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్

న్యూఢిల్లీ, జూలై 13: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలవగానే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు డెడ్‌లైన్ విధించాలని యూనివర్శిటీలను ఆదేశించినట్టు యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ బుధవారం ఇక్కడ తెలిపారు.

సీబీఎస్ఈ ఇంకా 12వ తరగతి ఫలితాలు విడుదల చేయకముందే కొన్ని యూనివర్శిటీలు అడ్మిషన్లు తీసుకుంటున్నాయన్న అంశంపై ఆయన మాట్లాడుతూ అలా చేస్తే ఆయా ఇనిస్టిట్యూట్లలో సీబీఎస్ఈ విద్యార్థులు ప్రవేశాలు పొందడంలో వెనకబడిపోతారని అని అన్నారు.

‘సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వెల్లడయ్యాక అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియకు చివరి తేదీ ప్రకటించాలని యూజీసీ ఆయా విద్యా సంస్థలను కోరింది..’ అని వివరించారు.

తాము రిజల్ట్స్ ప్రకటించే తేదీని బట్టి యూనివర్శిటీలు తమ అడ్మిషన్ల ప్రక్రియకు షెడ్యూలు నిర్ణయించేలా చూడాలని సీబీఎస్ఈ ఇటీవల కమిషన్‌కు విన్నవించింది. ఈ నేపథ్యంలో యూజీసీ యూనివర్శిటీలకు ఈ మేరకు లేఖ రాసింది.

కాగా సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను బోర్డు జూలై నెలాఖరులో ప్రకటించే అవకాశం ఉంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా పరీక్షల నిర్వహణ ఈ ఏడాది ఆలస్యమైంది.

కాగా సెంట్రల్ యూనివర్శిటీల్లో యూజీ అడ్మిషన్లు కామన్ యూనివర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) స్కోరు ఆధారంగానే ఉంటాయని, 12వ తరగతి మార్కుల ఆధారగా ఉండవని యూజీసీ మార్చి నెలలో ప్రకటించింది. సెంట్రల్ యూనివర్శిటీలు మినిమం ఎలిజిబులిటీ క్రైటీరియా ఫిక్స్ చేసుకోవచ్చని ప్రకటించింది.

నూతన విధానంలో స్టేట్ బోర్డు విద్యార్థులు నష్టపోరని జగదీష్‌కుమార్ స్పష్టం చేశారు. అలాగే కోచింగ్ కల్చర్‌ను కూడా ఈ పరీక్ష ప్రోత్సహించదని స్పష్టం చేశారు.

మొత్తం 44 సెంట్రల్ యూనివర్శిటీలు, 12 స్టేట్ యూనివర్శిటీలు, 11 డీమ్‌డ్ యూనివర్శిటీలు, 19 ప్రయివేటు యూనివర్శిటీలు సీయూఈటీ 2022-23లో పార్టిసిపేట్ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం