తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russia Coup : రష్యాలో సైనిక తిరుగుబాటు!.. పుతిన్​ పతనం మొదలైందా?

Russia coup : రష్యాలో సైనిక తిరుగుబాటు!.. పుతిన్​ పతనం మొదలైందా?

Sharath Chitturi HT Telugu

24 June 2023, 6:38 IST

  • Russia coup : రష్యా అధ్యక్షుడు పుతిన్​పై సైనిక తిరుగుబాటుకు రంగం సిద్ధమైందా? 'వాగ్నర్​' దళాలు యుద్ధభూమిని వీడి.. మాస్కోవైపు దూసుకెళుతున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..

రొస్తోవ్​ ఆన్​ డాన్​ నగరంలో పరిస్థితులు ఇలా..
రొస్తోవ్​ ఆన్​ డాన్​ నగరంలో పరిస్థితులు ఇలా.. (REUTERS)

రొస్తోవ్​ ఆన్​ డాన్​ నగరంలో పరిస్థితులు ఇలా..

Russia coup latest news : ఉక్రెయిన్​తో యుద్ధంలో భారీ నష్టాన్ని చూస్తున్న రష్యాపై మరో పిడుగు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు అత్యంత ఆందోళన కలిగించే వార్త! రష్యాలో సైనిక తిరుగుబాటుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రైవేట్​ మిలిటరీ సేవలు అందించే 'వాగ్నర్​' బృందం.. తిరుగుబాటు చేసిందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ట్రెండింగ్ వార్తలు

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

వాగ్నర్​ ఫైటర్స్​ తిరుగుబాటు..

ఈ ప్రైవేట్​ మిలిటరీ బృందానికి అధిపతి అయిన యెవ్జెనీ ప్రిగోజిన్.. రష్యా రక్షణశాఖపై కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. యుద్ధం పేరుతో తన దళంలో చాలా మందిని రష్యా హతమార్చిందని, అందుకు ప్రతీకారం తీర్చుకుంటానని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తమ దారికి అడ్డొచ్చిన వారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు.

"మా వాగ్నర్​ బృందం.. ఉక్రెయిన్​ నుంచి తిరిగొచ్చేసింది. రష్యాలోని రొస్తోవ్​ నగరానికి దక్షిణ భాగంలో ఉంది. మా వద్ద 25వేల మంది సైనికులు ఉన్నారు. మేము మాస్కోకు వెళుతున్నాము. మా దారికి అడ్డొస్తే సహించము. అయితే ఇది సైనిక తిరుగుబాటు కాదు. మా ఆగ్రహం అంతా రష్యా రక్షణశాఖపైనే. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము," అని ప్రిగోజిన్​ ఓ టెలిగ్రామ్​ ఆడియోలో చెప్పినట్టు తెలుస్తోంది. మరి మాట్లాడింది ప్రిగోజిన్​ ఏనా? కాదా? అన్నది స్థానిక మీడియాలు ధ్రువీకరించలేకపోయాయి.

Putin latest news : తాజా పరిణామాలపై రష్యా అధిష్ఠానం అప్రమత్తమైంది. మాస్కోలో ప్రస్తుతం హై అలర్ట్​ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. రాత్రికి రాత్రి.. నగరం అంతటా భారీ ఎత్తున బలగాలు మోహరించినట్టు సమాచారం. తాజా పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్​కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

'తిరిగి వెళ్లిపోండి..'

"వాగ్నర్​ దళాలు.. ప్రిగోజిన్​ను నమ్మకూడదు. ఆయనపైనే తిరుగుబాటు చేయాలి. మీరు పుతిన్​ ఆదేశాలు పాటించాలి. మీ సొంత స్థావరాలకు వెళ్లిపోవాలి. ఈ పరిస్థితులతో రష్యాకు మంచి జరగదు. రష్యా శత్రువులకు కలిసివస్తుంది. అలా జరగకూడదు. దయచేసి ఆగిపోండి," అని ఉక్రెయిన్​తో యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్న రష్యా డిప్యూటీ కమాండర్​ జనరల్​ సెర్గీ సురోవికిన్​.. వాగ్నర్​ దళాలకు సందేశం పంపించారు. అదే సమయంలో ప్రిగోజిన్​పై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Russia Wagner group news : వాస్తవానికి.. ఈ ప్రిగోజిన్​ అనే వ్యక్తి, పుతిన్​కు సన్నిహితుడే. కానీ ఇటీవలి కాలంలో మాస్కోతో ఆయన బంధం.. బలహీనపడుతూ వచ్చింది. రష్యా అధికారుల చేతకాని తనంతో తమ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అనేకమార్లు అసహనం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి, సాకులు వెతుక్కుని.. ఉక్రెయిన్​పై రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్​ పేరుతో దాడులు చేస్తోందని ఆరోపించారు. రష్యా మిసైల్​ దాడిలో వాగ్నర్​ దళాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్టు, అందుకే ప్రతీకారం కోసం తిరుగుబాటు చేస్తున్నట్టు ప్రిగోజిన్​ ప్రకటించారు. మిసైల్​ దాడి జరగలేదని రష్యా చెబుతోంది.

ఉక్రెయిన్​లోని కీలకమైన బాఖ్​ముట్​ నగరాన్ని గత నెలలో ఆక్రమించింది వాగ్నర్​ బృందం. గత పది నెలల్లో రష్యాకు ఇదే అతిపెద్ద విజయం. అలాంటిది.. వాగ్నర్​ బృందం ఇప్పుడు తమ అస్త్రాలను రష్యాపై ఎక్కుపెడుతుండటం సర్వత్రా చర్చలకు దారితీసింది.

Russia Ukraine war : మరోవైపు.. రష్యాలోని తాజా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు అమెరికా వెల్లడించింది. ఈ వ్యవహారంపై తమ మిత్రపక్షాలతో చర్చిస్తామని పేర్కొంది.

తదుపరి వ్యాసం