ICC issues arrest warrant on Putin: హేగ్ లో ఉన్న ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (International Criminal Court ICC) రష్యా అధ్యక్షుడు పుతిన్ (putin) కు అరెస్ట్ వారంటు జారీ చేయడం సంచలనంగా మారింది. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించి యుద్ధ నేరానికి పాల్పడ్డాడన్న ఆరోపణపై ఈ వారంటు జారీ అయింది.,ICC issues arrest warrant on Putin: చిన్న పిల్లల అపహరణఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి చిన్న పిల్లలు అపహరణకు గురికావడానికి పుతిన్ (Putin) ను ప్రధాన బాధ్యుడిని చేస్తూ ఐసీసీ (ICC) ఈ వారంటు జారీ చేసింది. ఐక్యరాజ్య సమితిలోని శక్తిమంతమైన భద్రత మండలి సభ్య దేశ అధ్యక్షుడికి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) వారంట్ జారీ చేయడం ఇదే ప్రథమం. పుతిన్ (Putin) కు ఐసీసీ వారంట్ జారీ చేయడాన్ని రష్యా, ఖండించగా, ఉక్రెయిన్ స్వాగతించింది. చిన్న పిల్లలను, ముఖ్యంగా అనాధ పిల్లలను ఉక్రెయిన్ లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యా కు అక్రమంగా తరలించడానికి సంబంధించిన నేరారోపణలపై పుతిన్ ను ప్రధాన నిందితుడిగా ఐసీసీ (ICC) పేర్కొంది. పుతిన్ (Putin) తో పాటు రష్యా అధ్యక్ష కార్యాలయంలో బాలల హక్కుల కమిషనర్ గా విధుల్లో ఉన్న మేరియా వోవా బెలొవాపై కూడా ఐసీసీ (ICC) అరెస్ట్ వారంటు జారీ చేసింది.,ICC issues arrest warrant on Putin: రష్యా సభ్య దేశం కాదు..అయితే, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) జారీ చేసిన ఈ వారంటును రష్యా పట్టించుకునే అవకాశాలు లేవు. రష్యా తమ దేశంపై ఐసీసీ పరిధిని ఇప్పటివరకు గుర్తించలేదు. అందువల్ల పుతిన్ (Putin) నే కాదు.. ఏ రష్యా పౌరుడిపై కూడా ఐసీసీ చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. కానీ, ఐసీసీ జారీ చేసిన వారంటు అంతర్జాతీయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) కు నైతికంగా ఒక మచ్చలా నిలిచిపోతుంది. అంతేకాకుండా, ఐసీసీ (ICC) జ్యూరిస్ డిక్షన్ ఉన్న దేశాల్లో జరిగే అంతర్జాతీయ సదస్సుల్లో ఒకవేళ పుతిన్ (Putin) పాల్గొంటే, అక్కడ అతడిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే, ఐసీసీ (ICC) సభ్య దేశాలకు పర్యటనకు వెళ్లినా, అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, ఐసీసీ సభ్య దేశాల దృష్టిలో పుతిన్ ఎన్నటికీ ఒక పరారీలో ఉన్న నిందితుడిగానే ఉండిపోతారు.