China, Russia on Ukraine war: ఉక్రెయిన్ యుద్ధం విషయంలో చైనా, రష్యా భాయి.. భాయి..-xi jinping tweaks china s position on ukraine war goes the russia way ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Xi Jinping Tweaks China's Position On Ukraine War, Goes The Russia Way

China, Russia on Ukraine war: ఉక్రెయిన్ యుద్ధం విషయంలో చైనా, రష్యా భాయి.. భాయి..

HT Telugu Desk HT Telugu
Mar 21, 2023 05:41 PM IST

China, Russia on Ukraine war: చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ (China President Xi Jinping) రష్యాలో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

China, Russia on Ukraine war: ఉక్రెయిన్ పై యుద్ధం (Russia Ukraine war) విషయంలో రష్యా (Russia) కు తోడుగా నిలిచే విషయంలో చైనా మరోసారి చతురత చూపింది. రష్యాకే తన మద్దతు అని ప్రత్యక్షంగా చెప్పకుండానే, ‘అన్ని దేశాల న్యాయబద్ధమైన సరిహద్దు ఆందోళనలను గౌరవించాల్సిన అవసరం ఉంద’ని వ్యాఖ్యానించింది. అదే సమయంలో, ‘అన్ని దేశాల సార్వభౌమత్వం, స్వాతంత్య్రం, భౌగోళిక సమగ్రతలను గౌరవించాల’న్న విషయాన్ని మాత్రం వ్యూహాత్మకంగా విస్మరించింది.

ట్రెండింగ్ వార్తలు

China, Russia on Ukraine war: ఆర్టికల్స్ రాసిన అధ్యక్షులు

రష్యా పర్యటన సందర్భంగా రష్యా పత్రిక ప్రావ్డా (Pravda) లో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ (Xi Jinping) ఒక వ్యాసం రాశారు. అదే సమయంలో చైనా పీపుల్స్ డైలీ (People’s Daily) పత్రిక లో రష్యా అధ్యక్షుడు పుతిన్ (Russia President Vladimir Putin) రాసిన వ్యాసం ప్రచురితమైంది. అంతర్జాతీయ సంక్షోభంగా మారిన ఉక్రెెయిన్ యుద్ధాన్ని (Russia Ukraine war) ఈ ఇద్దరు నేతల తమ తమ వ్యాసాల్లో ప్రస్తావించారు. ఈ యుద్ధం (Russia Ukraine war) కొనసాగడానికి ప్రత్యక్షంగానో, లేక పరోక్షంగానో అమెరికా (America) నే కారణమని వారు విమర్శించారు.

China, Russia on Ukraine war: అమెరికాపై విమర్శలు

ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine war) లో అమెరికా పాత్రను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (Xi Jinping), రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ వ్యాసాల్లో ప్రస్తావించారు. అమెరికా (America) నేతృత్వంలోని నాటో (NATO) కారణంగా ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine war) మరింత తీవ్రమవుతోందని పుతిన్ (Vladimir Putin)) విమర్శించారు. మరోవైపు, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇప్పటివరకు చైనా అధికారిక వైఖరికి వ్యతిరేకంగా జిన్ పింగ్ (Xi Jinping) వ్యాసం ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి (Russia Ukraine war) రాజకీయ పరిష్కారమే మార్గమని చైనా ఇన్నాళ్లు తన వైఖరిని వ్యక్తపరుస్తూ వచ్చింది. దేశాల భౌగోళిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని, స్వతంత్రతను గౌరవించాలని ఇన్నాళ్లూ పేర్కొంది. గత నెలలో కూడా చైనా విదేశాంగ మంత్రి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా, జిన్ పింగ్ (Xi Jinping)) తన వ్యాసంలో ఈ అభిప్రాయాన్ని విస్మరించారు. దేశాల భౌగోళిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని, స్వతంత్రతను గౌరవించాలన్న అంశాన్ని ప్రస్తావించకుండా, ‘అన్ని దేశాల న్యాయబద్ధమైన సరిహద్దు ఆందోళనలను గౌరవించాల్సిన అవసరం ఉంద’ని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ అంశాలకు, దేశాల ద్వైపాక్షిక అంశాలకు సంబంధించిన విషయాల్లో ఏ ఒక్క దేశం సొంత ఆదేశాలను, అభిప్రాయాలను రుద్దాలనుకోవడం ఆమోదనీయం కాదని స్పష్టం చేశారు. ఈ కామెంట్ అమెరికా (America) ను ఉద్దేశించే చేసినట్లు అర్థమవుతుంది. ఇది పరోక్షంగా ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని (Russia Ukraine war) సమర్ధించడమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

IPL_Entry_Point

టాపిక్