Russia Ukraine war: అనూహ్యంగా చైనా నుంచి ఉక్రెయిన్ కు ఫోన్ కాల్
Russia Ukraine war: చైనా రష్యాకు అత్యంత నమ్మకమైన మిత్రదేశం. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనూ చైనా రష్యాకే తోడుగా నిలిచింది. అయితే, అనూహ్యంగా, చైనా విదేశాంగ మంత్రి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రికి శుక్రవారం ఫోన్ చేశారు.
Russia Ukraine war: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని (Russia Ukraine war) చైనా ఇంతవరకు ఖండించలేదు. అయితే, తాజాగా, చైనా విదేశాంగ మంత్రి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రికి ఫోన్ చేసి, రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు.
Russia Ukraine war: చర్చలే పరిష్కారం
ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ సంక్షోభానికి (Russia Ukraine war) చర్చలే పరిష్కారమని చైనా స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య దాదాపు సంవత్సర కాలంగా కొనసాగుతున్న యుద్ధంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. సాధ్యమైనంత త్వరగా ఈ యుద్ధానికి (Russia Ukraine war) ముగింపు పలకాల్సిన అవసరం ఉందని సూచించింది. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో చైనా మొదటి నుంచి న్యాయబద్ధంగా వ్యవహరించిందని చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ (Qin Gang) ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా (Dmytro Kuleba) కి తెలిపారు. రెండు దేశాల మధ్య చర్చలు జరిగి శాంతి నెలకొనాలని, అందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలన్నది చైనా అభిమతమని క్విన్ గాంగ్ (Qin Gang) వివరించారు.
Russia Ukraine war: జెలెన్ స్కీ శాంతి ఫార్మూలా
ఈ సందర్బంగా చైనా విదేశాంగ మంత్రికి తమ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) శాంతి ఫార్మూలాను వివరించానని, అది ఆచరణాత్మక ఫార్మూలా అని తెలిపానని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా వెల్లడించారు. రష్యా ఆక్రమణకు (Russia Ukraine war) ముగింపు పలికి, ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే, జెలెన్ స్కీ (Zelensky) ఫార్మూలాను అమలు చేయడమొక్కటే మార్గమని స్పష్టం చేశానన్నారు.
Russia Ukraine war: అవధులు లేని స్నేహం
యుద్ధం ప్రారంభమైన దాదాపు సంవత్సరం తరువాత చైనా ఉక్రెయిన్ కు ఫోన్ చేయడంపై అంతర్జాతీయ సమాజంలో ఆసక్తి నెలకొంది. రష్యా తమకు అత్యంత సన్నిహిత మిత్ర దేశమైనా.. ఉక్రెయిన్, రష్యా యుద్ధం (Russia Ukraine war) లో భారత్ బహిరంగంగా రష్యాకు మద్దతు తెలపలేదు. ఇది యుద్ధాల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే కాలం కాదని భారత ప్రధాని మోదీ ఇప్పటికే నిర్ద్వంద్వంగా ప్రకటించారు. కానీ, చైనా మాత్రం రష్యాతో తమది అవధులు లేని స్నేహమని 2022లో స్పష్టం చేసింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఇప్పటివరకు ఖండించలేదు. రష్యాపై యూరోప్ దేశాలు, నాటో ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు, అనూహ్యంగా ఉక్రెయిన్ కు చైనా ఫోన్ చేయడం వెనుక వ్యూహమేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
టాపిక్