తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rupee Falls To Record Low: 80.58కి పడిపోయిన రూపాయి విలువ.. 81 దిశగా..

Rupee falls to record low: 80.58కి పడిపోయిన రూపాయి విలువ.. 81 దిశగా..

HT Telugu Desk HT Telugu

22 September 2022, 11:31 IST

google News
    • Rupee vs US dollar: రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 80.50కి పడిపోయింది. క్రమంగా 81కి పతనమయ్యే దిశగా కదులుతోంది.
80.50కి పడిపోయిన రూపాయి విలువ
80.50కి పడిపోయిన రూపాయి విలువ

80.50కి పడిపోయిన రూపాయి విలువ

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరింత దూకుడుగా వడ్డీరేట్లు పెంచడంతో భారత రూపాయి ఈరోజు అమెరికాతో పోలిస్తే రికార్డు స్థాయికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 80.2850 వద్ద ప్రారంభమైంది. క్రమంగా 80.58కిక్షీణించింది. నిన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ మూడోసారి భారీగా వడ్డీ రేటు పెంపును ప్రకటించింది. ముందు ముందు మరింత కఠినంగా వడ్డీ రేట్ల పెంపు ఉంటుందన్న సంకేతాలు ఇచ్చింది.

‘యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తాజా చర్య, వ్యాఖ్యానాన్ని బట్టి మనం ఇంకా రేట్ల పెంపు చక్రం ముగిసే సమయానికి చాలా దూరంలో ఉన్నామని స్పష్టంగా తెలుస్తుంది. దేశీయ ఆర్థిక అవకాశాలు మెరుగుపడినప్పటికీ రూపాయి ఒత్తిడిలోనే ఉంటుందని మేం భావిస్తున్నాం. దాదాపు 40 నెలల పాటు మిగులులో ఉన్న తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లోటు స్థితిలోకి మారినందున ప్రస్తుత సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయి క్షీణతను అరికట్టడానికి జోక్యం చేసుకోవడం, కఠినమైన చర్యలు తీసుకోవడం కష్టం…’  అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు.

‘సాంకేతికంగా డాలరు-రూపాయి జంట 81.5-82 జోన్ వైపు కదులుతోంది. రూపాయిలో మరింత బలహీనతకు దారితీసే ఆరోహణ ట్రయాంగిల్ ఫార్మేషన్ బ్రేక్అవుట్‌ను చూసింది..’ అని అన్నారు.

‘రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడ్ వరుసగా మూడోసారి 75 బేసిస్ పాయింట్ల మేర భారీ రేటు పెంపు మధ్య భారత రూపాయి తాజా రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్ట స్థాయి 111.78 స్థాయికి చేరుకుంది. యుఎస్ సెంట్రల్ బ్యాంక్ తన తాజా సమావేశంలో ఊహించిన దానికంటే ఎక్కువ వడ్డీ రేటు పెంచింది..’ అని రెలిగేర్ బ్రోకింగ్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సుగంధ సచ్‌దేవా అన్నారు. 

‘దేశీయ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ప్రవాహాల్లో తగ్గుదల రూపాయి-డాలర్ మారకం రేటులో క్షీణతను మరింత పెంచాయి. బలహీనమైన ముడి చమురు ధరలు ఇప్పటికీ దేశీయ కరెన్సీలో నష్టాలను పరిమితం చేస్తున్నాయి. 80.10 మార్కును అధిగమించడం వల్ల రాబోయే రోజుల్లో భారత రూపాయి విలువ 81 మార్క్ వైపు క్షీణతకు తలుపులు తెరిచింది..’ అని ఆమె జోడించారు.

 

తదుపరి వ్యాసం