Karnataka power rates hike: పోలింగ్ ముగిసిన రెండో రోజే కర్నాటక ప్రజలకు బీజేపీ ప్రభుత్వం షాక్; కరెంట్ చార్జీల పెంపు
12 May 2023, 19:27 IST
- Karnataka power rates hike: కర్నాటక ప్రజలకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎన్నికలు ముగిసి, మరి కొద్ది గంటల్లో ఫలితాలు వెల్లడవుతాయనగా.. కరెంట్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రతీకాత్మక చిత్రం
Karnataka power rates hike: కర్నాటక ప్రజలకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎన్నికలు ముగిసి, మరి కొద్ది గంటల్లో ఫలితాలు వెల్లడవుతాయనగా.. కరెంట్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Karnataka power rates hike: రేపు ఫలితాలు.. ఇవ్వాళ చార్జీల పెంపు
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 13వ తేదీన వెలువడనున్నాయి. మే 10వ తేదీన ఈ ఎలక్షన్స్ జరిగాయి. ఎన్నికలు ముగిసిన రెండో రోజే కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. కరెంట్ చార్జీలను పెంచుతున్నట్లు కర్నాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (Karnataka Electricity Regulatory Commission KERC) శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన షాక్ కు రాష్ట్ర ప్రజలు నిశ్చేష్టులయ్యారు. బొగ్గుతో పాటు విద్యుదుత్పత్తికి అవసరమైన ముడి సరుకుల ధరల్లో పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని KERC వెల్లడించింది.
Karnataka power rates hike: యూనిట్ పై 70 పైసల వరకు..
కర్నాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (Karnataka Electricity Regulatory Commission KERC) ప్రకటించిన తాజా కరెంట్ చార్జీల పెంపు ప్రకారం.. ప్రతీ వినియోగదారుడికి ఒక్కో యూనిట్ పై సగటున 70 పైసల వరకు భారం పడుతుంది. ఈ కరెంట్ చార్జీల పెంపును 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి లెక్క గట్టి వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది.