తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rrb Je Recruitment : 7వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ..

RRB JE recruitment : 7వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ..

Sharath Chitturi HT Telugu

31 July 2024, 7:20 IST

google News
    • ఆర్​ఆర్బీ జేఈ 2024 రిక్రూట్​మెంట్​కి సంబంధించిన అప్లికేషన్​ ప్రక్రియ మొదలైంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆర్​ఆర్బీ జేఈ 2024 అప్లికేషన్​ ప్రక్రియ షురు..
ఆర్​ఆర్బీ జేఈ 2024 అప్లికేషన్​ ప్రక్రియ షురు..

ఆర్​ఆర్బీ జేఈ 2024 అప్లికేషన్​ ప్రక్రియ షురు..

ఉపాధి నోటీసు సీఈఎన్ 03/2024 కింద జూనియర్ ఇంజినీర్లు (జేఈ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్లు (డీఎంఎస్), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్స్ (సీఎంఏ), కెమికల్ సూపర్వైజర్లు (రీసెర్చ్), మెటలర్జికల్ సూపర్వైజర్స్ (రీసెర్చ్) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (ఆర్ఆర్బీలు) ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. అర్హులైన అభ్యర్థులు rrbapply.gov.in ఆర్ఆర్బీ జేఈ 2024 కోసం తమ ఫారాలను సమర్పించవచ్చు. జులై 30న మొదలైన అప్లికేషన్​ ప్రక్రియ.. ఆగస్టు 29తో ముగుస్తుంది.

ఆర్ఆర్బీ జేఈ 2024: దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆర్​ఆర్బీ రిక్రూట్​మెంట్​ : ఖాళీల వివరాలు

రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇండియన్ రైల్వేలో 7,951 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో ఆర్ఆర్బీ గోరఖ్​పూర్ పరిధిలో కెమికల్ సూపర్వైజర్/ రీసెర్చ్, మెటలర్జికల్ సూపర్వైజర్/ రీసెర్చ్ పోస్టులు 17 ఉన్నాయి. మిగిలిన 7,934 జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి.

షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు ఫారాల్లో దిద్దుబాటు, సవరణ అనంతరం రుసుము చెల్లింపునకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 8 వరకు అవకాశం ఉంటుంది.

ఇదీ చూడండి:- UPSC ESE Main Result 2024: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాల వెల్లడి

ఆర్ఆర్బీ జేఈ 2024: అర్హత..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 2025 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి.

ప్రతి అభ్యర్థి ఒక ఆర్ఆర్బీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఉంది. వారు బహుళ పోస్టులను ఎంచుకున్నప్పటికీ, ఒక్కొక్కరు ఒకే ఉమ్మడి దరఖాస్తు ఫారాన్ని సమర్పించాలి. పోస్టుల వారీగా అర్హతల గురించి మరింత తెలుసుకోవడానికి నోటిఫికేషన్​ని చూడాల్సి ఉంటుంది. ఆర్​ఆర్బీ జేఈ నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆర్ఆర్బీ జేఈ 2024: ఎంపిక ప్రక్రియ..

రెండు దశల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) అనంతరం షార్ట్​లిస్ట్​ చేసిన అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ (డీవీ), మెడికల్ ఎగ్జామినేషన్ (ఎంఈ) తర్వాత ద్వారా ఎంపిక జరుగుతుంది.

కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 1/3వ వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.

దరఖాస్తు ఫీజు..

ఆర్ఆర్బీ జేఈ 2024 దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళ, ట్రాన్స్​జెండర్, మైనారిటీ లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ) అభ్యర్థులకు రూ.250, ఇతరులకు రూ.500. బ్యాంక్ ఛార్జీల తగ్గింపు తర్వాత ఫీజులో కొంత భాగాన్ని మొదటి సీబీటీకి హాజరైన తర్వాత తిరిగి చెల్లిస్తారు.

ఆర్ఆర్బీ జేఈ గురించి మరిన్ని వివరాలు, తాజా అప్డేట్స్ కోసం అభ్యర్థులు ఆయా ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్లను సందర్శించాలి.

తదుపరి వ్యాసం