తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rishi Sunak Wealth: రిషి సునక్ ఆస్తి ఎంతో తెలుసా? చాలా రిచ్..

Rishi Sunak wealth: రిషి సునక్ ఆస్తి ఎంతో తెలుసా? చాలా రిచ్..

HT Telugu Desk HT Telugu

22 October 2022, 22:36 IST

  • Rishi Sunak wealth: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ ఆస్తి ఎంతో తెలుసా? ఆయన బ్రిటన్ లోని టాప్ 250 సంపన్నుల్లో ఒకరు.

రిషి సునక్, అక్షిత మూర్తి దంపతులు
రిషి సునక్, అక్షిత మూర్తి దంపతులు

రిషి సునక్, అక్షిత మూర్తి దంపతులు

బ్రిటన్ పీఎం పదవి ఈ సారైనా దక్కించుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్న రిషి సునక్ కు సంబంధించిన ఆస్తి వివరాలు మరోసారి వైరల్ అవుతున్నాయి.

Rishi Sunak wealth: దంపతులిద్దరి ఆస్తి కలిపి..

బ్రిటన్ ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి భారతీయ సంతతికి చెందిన రిషి సునక్, ఆయన భార్య అక్షత మూర్తిల ఆస్తి సుమారు 730 మిలియన్ పౌండ్లు. Rishi Sunak భార్య అక్షత మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురు. వారిద్దరి ఆస్తిని లెక్కిస్తే వారు బ్రిటన్ లోని అత్యంత సంపన్నులైన తొలి 250 మందిలో ఒకరుగా తేలారు.

Rishi Sunak wealth: టైమ్స్ రిచ్ లిస్ట్

సండే టైమ్స్ ఈ సంవత్సరం ప్రచురించిన బ్రిటన్ అత్యంత సంపన్నుల జాబితాలో రిషి సునక్ దంపతులు 222 వ స్థానం సాధించారు. వారి మొత్తం స్థిర,చరాస్తుల విలువ సుమారు 730 మిలియన్ పౌండ్లు.

Rishi Sunak wealth: క్వీన్ ఎలిజబెత్ కన్నా రిచెస్ట్

బ్రిటన్ ప్రతినిధుల సభలో Rishi Sunak అత్యంత సంపన్నుడైన సభ్యుడు. ఇంకా చెప్పాలంటే, రిషి సునక్ భార్య, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తి(Akshata Murthy) ఆస్తి దివంగత బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II కన్నా ఎక్కువట. అక్షిత మూర్తి ఆస్తుల విలువ 430 మిలియన్ పౌండ్లు అని నిర్ధారించారు.

Rishi Sunak wealth: రియల్ ఎస్టేట్

రిషి సునక్, Akshata Murthy దంపతులకు విలాసవంతమైన నాలుగు ఇళ్లు ఉన్నాయి. అందులో రెండు లండన్ లో, ఒకటి యార్క్ షైర్ లో, మరొకటి లాస్ ఏంజెలిస్ లో ఉన్నాయి. కెసింగ్టన్ లో ఉన్న నాలుగంతస్తుల విలాసవంతమైన ఇల్లు విలువ 7 మిలియన్ పౌండ్లు. లండన్ లో వారికి ఓల్డ్ బ్రామ్టన్ లో మరో ఇల్లు ఉంది. కేలిఫోర్నియాలో బీచ్ కు ఎదురుగా ఉన్న సునక్ జంటకు చెందిన పెంట్ హౌజ్ లో ‘బే వాచ్’ సిరీస్ ను చిత్రీకరించారట. Rishi Sunak ఆస్తుల చట్టబద్ధతకు సంబంధించి లేబర్ పార్టీ ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు చేసింది.

Rishi Sunak wealth: సునక్ ఆదాయ మార్గం ఏంటి?

ఆర్థిక మంత్రిగా ఉండగా రిషి సునక్ వేతనం 1.51 లక్షల పౌండ్లు. ఒకవేళ ప్రధానిగా గెలిస్తే ఆ వేతనం మరింత పెరుగుతుంది. రాజకీయాల్లోకి రాకముందు, రిషిసునక్ రెండు అత్యంత లాభదాయక హెడ్జ్ ఫండ్స్ లో భాగస్వామి గా ఉన్నారు. 2001 నుంచి 2004 మధ్య ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ గోల్డ్ మ్యాన్ సాచ్స్ లో ఆయన అనలిస్ట్ గా పని చేశారు. రిషి సునక్ తన 25 ఏళ్ల వయస్సుకే మల్టీ మిలియనీర్ అయ్యారని టైమ్స్ వివరించింది.

తదుపరి వ్యాసం