తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sharad Pawar Receives Love Letter | నాకు ల‌వ్ లెట‌ర్ వ‌చ్చింది: శ‌ర‌ద్ ప‌వార్‌

Sharad Pawar receives love letter | నాకు ల‌వ్ లెట‌ర్ వ‌చ్చింది: శ‌ర‌ద్ ప‌వార్‌

HT Telugu Desk HT Telugu

01 July 2022, 18:49 IST

google News
  • ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌కు ప్రేమ లేఖ వ‌చ్చింది. ప‌వార్ ఈ విష‌యాన్ని శుక్ర‌వారం ఉద‌యం వెల్ల‌డించారు. శివ‌సేన రెబ‌ల్ నేత ఏక్‌నాథ్ షిండే సీఎంగా ప్ర‌మాణం చేసిన మ‌ర్నాడే త‌న‌కు ప్రేమ లేఖ అందింద‌ని వ్యాఖ్యానించారు.

నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌
నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌

నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌

నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌. ఆ పార్టీ ఇన్నాళ్లు అధికారంలో ఉన్న మ‌హా వికాస్ అఘాడీ`లో భాగ‌స్వామ్య పార్టీ. ఆ కూట‌మి అధికారం కోల్పోయి, బీజేపీతో క‌లిసి శివ‌సేన తిరుగుబాటు వ‌ర్గం అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. తాజాగా, ఎన్సీపీ చీఫ్ ప‌వార్‌కు ప్రేమ‌లేఖ వ‌చ్చింది.

ఐటీ నుంచి ల‌వ్ లెట‌ర్‌

ఆదాయ ప‌న్ను శాఖ నుంచి త‌న‌కు ల‌వ్ లెట‌ర్ వ‌చ్చింద‌ని శ‌ర‌ద్ ప‌వార్ వ్యాఖ్యానించారు. ఐటీ శాఖ నుంచి వ‌చ్చిన నోటీసు గురించి ఆయ‌న అలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. `నాకు ఒక ల‌వ్‌లెట‌ర్ వ‌చ్చింది. ఆదాయ ప‌న్ను శాఖ నుంచి ఆ ప్రేమ‌లేఖ వ‌చ్చింది. 2004, 2009, 2014, 2020లో నేను స‌మ‌ర్పించిన ఎన్నిక‌ల అఫిడ‌విట్‌ల‌కు సంబంధించి నోటీసు వ‌చ్చింది` అని ప‌వార్ ట్వీట్ చేశారు. కొంద‌రు ఎంపిక చేసిన‌ వ్య‌క్తుల నుంచి స‌మాచారం తీసుకునే కార్య‌క్ర‌మాన్ని ఐటీ విభాగం ప్రారంభించింద‌ని వ్యాఖ్యానించారు. `ఇన్ని సంవ‌త్స‌రాల త‌రువాత కూడా స‌మాచారం తీసుకుంటున్నారంటే, ఐటీ విభాగంలో స‌మ‌ర్థ‌త బాగా పెరిగిన‌ట్లుంది. ఐటీ ` అని ప‌వార్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

అది అధికార దాహం

కాంగ్రెస్‌, ఎన్సీపీల‌తో క‌లిసి హిందుత్వానికి శివ‌సేనను దూరం చేశార‌ని ఏక్‌నాథ్ షిండే చేసిన ఆరోప‌ణ‌ల‌పై ప‌వార్ స్పందించారు. వారిది సైద్ధాంతిక పోరాటం కాద‌ని, అధికార దాహ‌మ‌ని వ్యాఖ్యానించారు.

తదుపరి వ్యాసం