తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /   Crypto Currencies: క్రిప్టోకరెన్సీ నిషేధించాలన్నదే ఆర్‌బీఐ అభిప్రాయం: కేంద్రం

Crypto currencies: క్రిప్టోకరెన్సీ నిషేధించాలన్నదే ఆర్‌బీఐ అభిప్రాయం: కేంద్రం

HT Telugu Desk HT Telugu

19 July 2022, 19:07 IST

google News
    • క్రిప్టోకరెన్సీ నిషేధించాలన్నదే ఆర్‌బీఐ అభిప్రాయమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (AP)

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ, జూలై 18: క్రిప్టోకరెన్సీలు ద్రవ్య, ఆర్థిక స్థిరత్వంపై అస్థిర ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నందున వాటిని నిషేధించాలని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం అన్నారు.

‘ఒక దేశపు ద్రవ్య, ఆర్థిక స్థిరత్వంపై క్రిప్టోకరెన్సీల అస్థిరత ప్రభావం ఉన్నందున ఈ రంగంపై చట్టాన్ని రూపొందించాలని ఆర్‌బీఐ సిఫార్సు చేసింది. క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని ఆర్‌బీఐ అభిప్రాయపడింది..’ అని ఆమె లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

భారత ఆర్థిక వ్యవస్థపై క్రిప్టోకరెన్సీల ప్రతికూల ప్రభావంపై ఆర్‌బీఐ తన ఆందోళనను వ్యక్తం చేసిందని ఆమె తెలిపారు.

‘క్రిప్టోకరెన్సీ కరెన్సీ కాదని ఆర్‌బిఐ పేర్కొంది. ప్రతి ఆధునిక కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ లేదా ప్రభుత్వం జారీ చేయాల్సి ఉంటుంది. కరెన్సీల విలువ ద్రవ్య విధానం, చట్టబద్ధమైన కరెన్సీగా వాటి హోదా ద్వారా విలువ సంతరించుకుంటుంది. అయితే క్రిప్టోకరెన్సీల విలువ కేవలం ఊహాగానాలు, అధిక రాబడుల అంచనాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇది ఒక దేశపు ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తుంది..’ అని ఆమె అన్నారు.

క్రిప్టోకరెన్సీ సరిహద్దులు లేనివని, రెగ్యులేటరీ ఆర్బిట్రేజీని నిరోధించడానికి అంతర్జాతీయ సహకారం అవసరమని ఆమె అన్నారు.

ఏకరీతి వర్గీకరణ, ప్రమాణాల మదింపు, నష్టాలు, ప్రయోజనాల మూల్యాంకనం‌పై అంతర్జాతీయ సహకారం తర్వాత మాత్రమే నియంత్రణ కోసం లేదా అటువంటి కరెన్సీలను నిషేధించడం కోసం ఏదైనా చట్టం తెస్తేనే ప్రభావవంతంగా ఉంటుందని ఆమె చెప్పారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2013 నుండి వర్చువల్ కరెన్సీల వినియోగదారులు, హోల్డర్లు, వ్యాపారులను హెచ్చరిస్తూ వస్తోంది. వర్చువల్ కరెన్సీల్లో ఆర్థిక, కార్యాచరణ, చట్టపరమైన, భద్రత సంబంధిత రిస్క్‌లు ఉంటాయి.

టాపిక్

తదుపరి వ్యాసం