తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ramzan | భారత్​లో నెలవంక దర్శనం.. ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు

Ramzan | భారత్​లో నెలవంక దర్శనం.. ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు

HT Telugu Desk HT Telugu

02 April 2022, 21:32 IST

google News
    • ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్​ మాసం .. భారత్​లో ప్రారంభమైంది. దేశంలో శనివారం నెలవంక దర్శనమిచ్చింది.
ఢిల్లీలోని ఓ మసీదులో…
ఢిల్లీలోని ఓ మసీదులో… (AFP)

ఢిల్లీలోని ఓ మసీదులో…

Ramadan 2022 Moon Sighting in India | భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో.. శనివారం సాయంత్రం నెలవంక దర్శనమిచ్చింది. ఫలితంగా ఆదివారం నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు.

"పవిత్ర రంజాన్​ మాసం ప్రారంభమైంది. ఈ క్రమంలో దేశంలోని ముస్లింలకు శుభాకాంక్షలు. దేశ శాంతిభద్రతల కోసం మేము ప్రార్థనలు చేస్తాము," అని ఫతేహ్​పూర్​ మసీదు ఇమామ్​ ముఫ్తీ ముకర్రం అహ్మద్​ వెల్లడించారు.

తమిళనాడు, పశ్చిమ్​ బెంగాల్​, ఉత్తర్​ప్రదేశ్​ తదితర రాష్ట్రాల్లోనూ నెలవంక దర్శనమిచ్చిందని ప్రాంతీయ ముస్లిం సంస్థలు వెల్లడించాయి.

సౌదీలో శుక్రవారమే నెలవంక దర్శనం..

Ramadan moon sighting | ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో రంజాన్​ మాసం శుక్రవారమే ప్రారంభమైంది. సౌదీ అరేబియాలో స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి నెలవంక దర్శనమిచ్చింది. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు మొదలుపెట్టారు.

రంజాన్​ మాసాన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. నెలరోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తుంటారు. చివరి రోజున ఈద్​గా జరుపుకుంటారు. కాగా.. ప్రతియేటా రంజాన్​ ప్రారంభమయ్యే రోజు.. మారుతూ ఉంటుంది. ముస్లింలు లూనార్​ క్యాలెండర్​ను అనుసరిస్తుండటమే ఇందుకు కారణం.

అఫ్గానిస్థాన్​, అల్బేనియా, అర్మేనియా, ఆస్ట్రియా, అజర్​బైజాన్​, బహ్రైన్​, బెల్జియం, బొలీవియా, బల్గేరియా, చేచ్నియా, డెన్​మార్క్​, ఫిన్​ల్యాండ్​, జార్జియా, హంగేరీ, ఐస్​ల్యాండ్​, ఇరాక్​, ఇటలీ, జపాన్​, జార్డన్​, కజకిస్థాన్​, కువైట్​, కిరిగిస్థాన్​, లెబెనాన్​, మౌరీటనియా, నెథర్లాండ్స్​, పాలెస్తీనా, ఖతార్​, రొమేనియా, రష్యా, సింగపూర్​, సుడాన్​, స్విడెన్​, స్విట్జర్లాండ్​, సిరియా, తైవాన్​, తజకిస్థాన్​, టోగో, యూఏఈ, యూకే, ఉజ్బెకిస్థాన్​, యెమెన్​ తదితర దేశాలు.. సౌదీ అరేబియా ప్రకటనను ప్రామాణికంగా తీసుకుని రంజాన్​ పవిత్ర మాసాన్ని మొదలుపెట్టాయి.

ఆస్ట్రేలియాలో నెలవంక శుక్రవారమే దర్శనమిచ్చింది. అందువల్ల​ శనివారం ఉపవాసం చేపట్టారు ముస్లింలు.

తదుపరి వ్యాసం