తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News: అత్యాచార బాధితురాలిని కోర్టు హాళ్లోనే బట్టలు విప్పమన్న మేజిస్ట్రేట్; ఆ న్యాయమూర్తిపై కేసు నమోదు

Crime news: అత్యాచార బాధితురాలిని కోర్టు హాళ్లోనే బట్టలు విప్పమన్న మేజిస్ట్రేట్; ఆ న్యాయమూర్తిపై కేసు నమోదు

HT Telugu Desk HT Telugu

04 April 2024, 13:41 IST

  • న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయమూర్తి స్వయంగా అన్యాయానికి, అకృత్యానికి పాల్పడిన ఘటన ఇది. తనపై సామూహిక అత్యాచారం జరిగిందని కోర్టును ఆశ్రయించిన యువతిని బట్టలు విప్పి గాయాలు చూపించమని స్వయంగా మెజిస్ట్రేటే అడిగిన ఘటన రాజస్తాన్ లో చోటు చేసుకుంది. దాంతో ఆ బాధిత యువతి ఆ మెజిస్ట్రేట్ పై పోలీసు కేసు పెట్టింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan Crime news: తనపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన దళిత యువతిని గాయాలు చూపించేందుకు బట్టలు విప్పాలని రాజస్తాన్ లోని కరౌలి జిల్లాలో ఉన్న హిందౌన్ కోర్టు మేజిస్ట్రేట్ కోరాడు. అందుకు నిరాకరించిన ఆ యువతి.. ఆ న్యాయమూర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేజిస్ట్రేట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

CBSE Class 12 Result 2024: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

మెజిస్ట్రేట్ పై కేసు నమోదు

తన గాయాలను చూడటానికి హిందౌన్ కోర్టు మేజిస్ట్రేట్ తనను బట్టలు విప్పమని కోరారని ఆరోపిస్తూ బాధితురాలు మార్చి 30 న ఫిర్యాదు చేసిందని డిప్యూటీ ఎస్పీ (ఎస్టీ-ఎస్సీ) సెల్ మీనా మీనా తెలిపారు. ఆమె బట్టలు విప్పడానికి నిరాకరించిందని, మార్చి 30న కోర్టులో వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ పై ఫిర్యాదు చేసిందని తెలిపారు. గౌరవానికి భంగం కలిగించారనే అభియోగాల కింద కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు మీనా తెలిపారు. ఆ మేజిస్ట్రేట్ పై ఐపీసీ సెక్షన్ 345(అక్రమ నిర్బంధం), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును రాజస్తాన్ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ అజయ్ సింగ్ జాట్ నేతృత్వం లోని బృందానికి కేసును బదిలీ చేశారు.

సామూహిక అత్యాచారం

మార్చి 19న ఆ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయంపై మార్చి 27న హిందౌన్ సదర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైందని పోలీసులు తెలిపారు.

తదుపరి వ్యాసం