Rains lash parts of Tamil Nadu, Chennai: తమిళనాడులో భారీ వర్షాలు; చెన్నై జలమయం
08 January 2024, 22:14 IST
Rains lash parts of Tamil Nadu, Chennai: తమిళనాడును అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెన్నైలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
భారీ వర్షాలతో జలమయమైన చెన్నై రోడ్డు
Rains lash parts of Tamil Nadu, Chennai: గురువారం రాత్రి నుంచి తమిళనాడులో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్ర, శని వారాల్లోనూ భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rains lash parts of Tamil Nadu, Chennai: అల్ప పీడనం ప్రభావం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో నవంబర్ 11 నుంచి 13 వరకు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడులో గురువారం సాయంత్రం నుంచి వర్ష బీభత్సం ప్రారంభమైంది. చెన్నై నగరం దాదాపు జలమయమైంది. రహదారులు మోకాలెత్తు నీటిలో మునిగాయి. అనూహ్య వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Rains lash parts of Tamil Nadu, Chennai: విద్యా సంస్థలు బంద్
మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశమున్నదందున చెన్నై, చంగల్పట్లు, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నైతో పాటు తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురంలలో భారీ వర్షాలు సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.
Rains lash parts of Tamil Nadu, Chennai: పుదుచ్చేరి లోనూ
తమిళనాడుకు పొరుగున్న ఉన్న పుదుచ్చేరి లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా అక్కడి ప్రజలతో పాటు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రాత్రి నుంచి ఈ పర్యాటక ప్రాంతంలో కుండపోత కొనసాగుతోంది. దాంతో, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని పాఠశాలలు, కాలేజీలకు శుక్ర, శనివారాలు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. లక్ష్యద్వీప్, కేరళ తీర ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.