తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bharat Jodo Yatra@1000km: ‘కర్నాటకలో నడుస్తోంది కమిషన్ ప్రభుత్వం‘

Bharat Jodo Yatra@1000km: ‘కర్నాటకలో నడుస్తోంది కమిషన్ ప్రభుత్వం‘

HT Telugu Desk HT Telugu

17 April 2024, 16:48 IST

google News
  • Bharat Jodo Yatra@1000km: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర శనివారం కీలక మైలురాయికి చేరుకుంది. కర్నాటకలో కొనసాగుతున్న ఈ యాత్ర  శనివారం 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటేసింది. 

రాహుల్ గాంధీ బళ్లారి సభకు లక్షలాదిగా హాజరైన జన సందోహం
రాహుల్ గాంధీ బళ్లారి సభకు లక్షలాదిగా హాజరైన జన సందోహం

రాహుల్ గాంధీ బళ్లారి సభకు లక్షలాదిగా హాజరైన జన సందోహం

Bharat Jodo Yatra@1000km: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేష స్పదన లభిస్తోంది. తమిళనాడులో ప్రారంభించి, కేరళ గూండా, కర్నాటకలో అడుగుపెట్టి విజయవంతంగా 1000 కిమీల దూరాన్ని ఈ యాత్ర ముగించింది.

Bharat Jodo Yatra@1000km: బళ్లారి లో భారీ సభ

భారత్ జోడో యాత్ర 1000 కిమీలు విజయవంతంగా కొనసాగిన సందర్భంగా కర్నాటకలోని బళ్లారిలో కాంగ్రెస్ భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభకు కర్నాటకలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అవినీతిని వ్యవస్థీకృతం చేసిందని మండిపడ్డారు.

Bharat Jodo Yatra@1000km: 40% కమిషన్ ప్రభుత్వం

కర్నాటకలో అవినీతి రాజ్యమేలుతోందని, 40% కమిషన్ ఇస్తే ప్రభుత్వంలో ఏ పని ఐనా ఐపోతుందని విమర్శించారు. ‘పోలీస్ విభాగంలో ఎస్ ఐ ఉద్యోగం కావాలంటే రూ. 80 లక్షలు ఇస్తే చాలు.. మెరిట్ లేకున్నా ఉద్యోగం వచ్చేస్తుంది. నిజాయితీగానే సంపాదించాలనుకుంటే మాత్రం ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లు సాధ్యం కాదు’ అని రాహుల్ విమర్శించారు. కర్నాటకలో ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. పేటీఎం తరహాలో ‘పేసీఎం’ పాలన నడుస్తోందని విమర్శిస్తోంది.

<p>బళ్లారి సభలో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ</p>

Bharat Jodo Yatra@1000km: ఎస్సీల నిధులను కూడా దోచేశారు

కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తోందని రాహుల్ విమర్శించారు. వారి నిధులను కూడా దోచేస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు, నేరాలు 50% పెరిగాయని, ఈ ప్రభుత్వం దళిత, గిరిజన వ్యతిరేక ప్రభుత్వంమని మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర కర్నాటక నుంచి తెలంగాణలో ప్రవేశిస్తుంది. యాత్ర ఊహించని స్థాయిలో విజయవంతం కావడంపై కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి.

తదుపరి వ్యాసం