PM Modi abroad trips: పీఎం మోదీ విదేశీ ప్రయాణాల ఖర్చు ఎంతో తెలుసా?
02 February 2023, 18:03 IST
PM Modi abroad trips: గత మూడేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేసిన విదేశీ ప్రయాణాల వివరాలు, ఆ విదేశీ ప్రయాణాలకు అయిన ఖర్చు వివరాలను ప్రభుత్వం గురువారం పార్లమెంటు (parliament) కు వెల్లడించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
PM Modi abroad trips: గత మూడేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మొత్తం 21 అధికారిక విదేశీ ప్రయాణాలు చేశారు. ప్రధాని చేసిన అధికారిక విదేశీ ప్రయాణాల మొత్తం ఖర్చు రూ.22.76 కోట్లు అని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ పార్లమెంటుకు తెలిపారు.
PM Modi abroad trips: రాష్ట్రపతి విదేశీ ప్రయాణాలు
అదే మూడేళ్ల కాలంలో రాష్ట్రపతి 8 అధికారిక విదేశీ ప్రయాణాలు చేశారని, ఆ ప్రయాణాలకు గానూ రూ. 6.24 కోట్లు ఖర్చు అయ్యాయని మురళీధరన్ రాజ్యసభకు తెలిపిన లిఖిత పూర్వక సమాధానంలో వివరించారు. ప్రధానమంత్రి (PM Modi) అధికారిక పర్యటనల కోసం రూ. 22,76,76,934 ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు అయిందని, అలాగే, రాష్ట్రపతి (President) అధికారిక పర్యటనల కోసం రూ. 6,24,31,424 ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు అయిందని వెల్లడించారు.
PM Modi abroad trips: విదేశాంగ మంత్రి పర్యటనలు
గత మూడేళ్లలో విదేశాంగ మంత్రి చేసిన వివిధ దేశాల పర్యటనల ఖర్చు రూ. 20.87 కోట్లని మురళీధరన్ తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత మూడేళ్లలో అధికారికంగా 86 విదేశీ పర్యటనలు జరిపారని మురళీధరన్ వెల్లడించారు. ప్రధాని మోదీ గత మూడేళ్లలో మూడుసార్లు జపాన్, రెండుసార్లు అమెరికా, రెండు సార్లు యూఏఈ లలో పర్యటించారు. గత మూడేళ్లలో రాష్ట్రపతి (President) చేసిన 8 పర్యటనల్లో ఏడు పర్యటనలను గత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేయగా, ఒక పర్యటనను ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేశారు. ద్రౌపది ముర్ము గత సెప్టెంబర్ లో యూకే వెళ్లారు.
టాపిక్