తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi Presses Putin To End War In Ukraine: `యుద్ధాల కాలం కాదిది`

PM Modi presses Putin to end war in Ukraine: `యుద్ధాల కాలం కాదిది`

HT Telugu Desk HT Telugu

16 September 2022, 21:49 IST

  • PM Modi presses Putin to end war in Ukraine: ఉక్రెయిన్ తో రష్యా చేస్తున్న యుద్ధంపై భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని తేల్చి చెప్పింది. SCO సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

     

రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో భారత ప్రధాని మోదీ
రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో భారత ప్రధాని మోదీ (via REUTERS)

రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో భారత ప్రధాని మోదీ

PM Modi presses Putin to end war in Ukraine:Shanghai Cooperation Organisation (SCO) సదస్సు ఉజ్బెకిస్తాన్ లోని సమర్ ఖండ్ లో జరుగుతోంది. ఈ కీలక సదస్సుకు భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్.. తదితర సభ్య దేశాలు హాజరయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

PM Modi presses Putin to end war in Ukraine: మోదీ, పుతిన్ భేటీ

SCO సదస్సు సమావేశాలతో పాటు సమాంతరంగా సభ్య దేశాల అధినేతలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే, శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ తో రష్యా యుద్ధంపై భారత్ వైఖరిని మోదీ మరోసారి పునరుద్ఘాటించారు.

PM Modi presses Putin to end war in Ukraine: యుద్ధం వద్దు

ప్రస్తుతం సమాజం యుద్ధాలు చేసుకునే కాలంలో లేదని ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు వివరించారు. సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్ సంక్షోభాన్ని నిలువరించాలని కోరారు. ప్రపంచంలో ఆహార భద్రత, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్య మార్గాలు ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. ప్రపంచ దేశాలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఆహార భద్రత, ఇంధన భద్రత, ఎరువుల కొరత.. మొదలైనవి. వాటి పరిష్కారం కోసం కలసికట్టుగా పని చేయాల్సి ఉంది` అని మోదీ వివరించారు. గతంలో పలుమార్లు జరిగిన ఫోన్ సంభాషణల్లోనూ ఇదే విషయాన్ని తాను వివరించినట్లు మోదీ పుతిన్ కు గుర్తు చేశారు. పుతిన్ తో మోదీ సమావేశ వివరాలను భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

PM Modi presses Putin to end war in Ukraine: మీ ఆందోళన అర్థమైంది

మోదీ వ్యక్తం చేసిన ఆందోళనలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా స్పందించారు. `మీ ఆందోళనను అర్థం చేసుకోగలను. సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది` అని పుతిన్ హామీ ఇచ్చారు. చర్చల మార్గాన్ని ఉక్రెయిన్ తోసిపుచ్చిందని, యుద్ధ క్షేత్రంలోనే తేల్చుకోవాలనుకుందని వివరించారు.

PM Modi presses Putin to end war in Ukraine:ఇదే తొలిసారి

ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభమైన తరువాత ఇరువురు నేతలు ప్రత్యక్షంగా సమావేశం కావడం ఇదే ప్రథమం. పుతిన్ తో భేటీ అద్బుతంగా జరిగిందని సమావేశ అనంతరం మోదీ ట్వీట్ చేశారు. వాణిజ్యం, ఎనర్జీ, డిఫెన్స్, తదితర రంగాల్లో రష్యా, భారత్ ల పరస్పర సహకారంపై చర్చించామన్నారు.

తదుపరి వ్యాసం