తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pilot Threatens To Crash Stolen Aircraft: `విమానంతో వాల్ మార్ట్ స్టోర్ లోకి`

Pilot threatens to crash stolen aircraft: `విమానంతో వాల్ మార్ట్ స్టోర్ లోకి`

HT Telugu Desk HT Telugu

03 September 2022, 21:13 IST

google News
  • Pilot threatens to crash stolen aircraft: మిసిసిప్పి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడో దొంగ పైలట్. దొంగలించిన విమానంతో వాల్ మార్ట్ స్టోర్ లోకి దూసుకెళ్తానని హెచ్చరించి పరుగులు పెట్టించాడు. 

మిసిసిపీ లోని టుపెలొ గగనతలంపై విమానం చక్కర్లు
మిసిసిపీ లోని టుపెలొ గగనతలంపై విమానం చక్కర్లు

మిసిసిపీ లోని టుపెలొ గగనతలంపై విమానం చక్కర్లు

Pilot threatens to crash stolen aircraft:దొంగతనం చేసిన ఒక చిన్న విమానంతో మిసిసిపిలోని టుపెలో పట్టణంపై చక్కర్లు కొట్టిన ఒక దుండగుడు ఆ విమానాన్ని టుపెలో లోని ఒక వాల్ మార్ట్ స్టోర్ లో కూల్చేస్తానని హెచ్చరించాడు.

Pilot threatens to crash stolen aircraft: పోలీసుల అప్రమత్తత

మొదట ఈ హెచ్చరికను పెద్ధగా పట్టించుకోని పోలీసులు.. నిజంగానే ఆ దుండగుడు విమానంతో టుపెలొ గగన తలంపై చక్కర్లు కొట్టడాన్ని గుర్తించి, అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ వాల్ మార్ట్ లోని సిబ్బంది, వినియోగదారులను బయటకు పంపించేశారు. దగ్గర్లోని ఇతర భవనాల్లోని ప్రజలను కూడా సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఆ ప్రాంతంలో భద్రత పెంచారు. ఆ పైలట్ తో సంప్రదింపులు జరపడం ప్రారంభించారు.

Pilot threatens to crash stolen aircraft: ఏర్పోర్ట్ అథారిటీ ఉద్యోగే..

విమానాన్ని దొంగలించి వాల్ మార్ట్ స్టోర్ లో కూల్చేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడు టుపెలొ రీజనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఉద్యోగేనని, ఉద్యోగంలో సమస్యతో ఈ పని చేశాడని గుర్తించారు. ఆ విమానం కూడా 9 సీట్ల మినీ 2 ఇంజిన్ 1987 బీచ్ సీ 90 ఏ విమానమని నిర్ధారించారు. టుపెలొ గగనతలంపై దాదాపు 3 గంటల పాటు చక్కర్లు కొట్టిన విమానం ఆ తరువాత పశ్చిమంగా వెళ్లి టొయొటా వాహన ఉత్పత్తి కేంద్రంపై చక్కర్లు కొడుతున్నట్లు గుర్తించారు.

తదుపరి వ్యాసం