PETA calls for sex strike: ‘మాంసం తినే మగవారితో సెక్స్ వద్దు’
27 September 2022, 16:18 IST
- PETA calls for sex strike: జంతు సంరక్షణ సంస్థ ‘పెటా’ మహిళలకు వినూత్న పిలుపునిచ్చింది. మాంసం తినే పురుషులతో సెక్స్ కు నో చెప్పాలని మహిళలను కోరింది. ఈ ‘సెక్స్ స్ట్రైక్’ వివరాలేంటో చూడండి..
ప్రతీకాత్మక చిత్రం
PETA calls for sex strike: వాతావరణ మార్పులకు, కాలుష్య భూతానికి, గ్రీన్ హౌస్ ఉద్గారాలకు మాంసం తినే పురుషులే ప్రధాన కారణమని People for the Ethical Treatment of Animals (PETA) చెప్తోంది. సాధారణంగా స్త్రీల కన్నా పురుషులు ఎక్కువగా మాంసాన్ని తింటారు కనుక వారి వల్ల ఈ వాతావరణ సమస్య మరింత పెరుగుతోందని Plos One జర్నల్ లో వచ్చిన కథనాన్ని ఉదహరిస్తోంది. ఇందుకు ఒక వినూత్న నిరసనను తెర పైకి తెచ్చింది.
PETA calls for sex strike: సెక్స్ స్ట్రైక్
ఈ వాతావరణ మార్పుల సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పెటా సూచిస్తున్న వినూత్న నిరసన సెక్స్ స్ట్రైక్. అంటే, ‘మాంసం తినే పురుషులను స్త్రీలు దగ్గరకు రానివ్వనట్లైతే, వారు మాంసం తినడం మానేస్తారు. తద్వారా మాంసం వినియోగం తగ్గుతుంది. తద్వారా, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది’ అని పెటా చెబుతోంది. ప్రస్తుతం జర్మనీలో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. మాంసం అధికంగా తినడం వంటి పురుషుల ఆహార అలవాట్ల వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ 41 శాతంఎక్కువగా విడుదల అవుతున్నాయని Plos One జర్నల్ ను ఉదహరిస్తూ పెటా వివరిస్తోంది. ‘ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లోని మగవారు ఒక చేత్తో బీరు బాటిల్ ను, మరో చేత్తో ఖరీదైన గ్యాస్ గ్రిల్స్ పై వేయించిన మాంసాన్ని చూపిస్తూ మాంసం వినియోగానికి అధిక ప్రచారం కల్పిస్తున్నారు. మాంసం ఎక్కువగా తినడం తమ పురుషత్వ నిరూపణ అనుకుంటూ జంతుజాలానికి, భూ గోళానికి ముప్పు తీసుకువస్తున్నారు’ అని మాంసాహార పురుషులపై విమర్శలు గుప్పించింది.
PETA calls for sex strike: శాఖాహారం ముద్దు
గత పదేళ్లలో యూకేలో మాంసం వినియోగం 17 శాతం తగ్గిందని పెటా వివరిస్తోంది. అయితే, అది సరిపోదని, ఇప్పటికీ కోట్ల సంఖ్యలో కోళ్లను, పందులను, గొర్లు, మేకలను చంపేస్తున్నారని తెలిపింది. ‘మాంసాహాారానికి బదులుగా శాఖాహారం తీసుకోండి. తద్వారా, ఆరోగ్యం బావుంటుంది, కాలుష్యమూ తగ్గుతుంది’ అని పెటా సూచిస్తోంది. ప్రభుత్వాలకు మరో సూచన కూడా చస్తోంది పెటా. అదేంటంటే, మాంసం, మాంసాహార ఉత్పత్తులపై భారీగా పన్నులు వేయాలని సూచిస్తోంది. వాటిపై కనీసం 41% పన్ను వేస్తే కానీ, మాంసాహార వినియోగం తగ్గదని స్పష్టం చేస్తోంది.