India test fires ballistic missile: అణ్వాయుధ సామర్ధ్యంలో మరో విజయం
14 October 2022, 22:18 IST
India test fires ballistic missile: అణ్వాయుధాలను తీసుకువెళ్లగల జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిహంత్’ నుంచి భారత్ విజయవంతంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.
జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ దృశ్యం
India test fires ballistic missile: జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. అత్యంత కచ్చితత్వంతో ఈ మిస్సైల్ లక్ష్యాన్ని చేధించిందని భారత రక్షణ శాఖ ప్రకటించింది.
India test fires ballistic missile: బంగాళాఖాతం నుంచి
ఈ ప్రయోగాన్ని బంగాళా ఖాతంలో అణ్వాయుధ సామర్ధ్యమున్న జలాంతర్గామి INS Arihant నుంచి నిర్వహించారు. ఈ ప్రయోగం ద్వారా భారత సాయుధ సామర్ధ్యం మరోసారి రుజువైందని రక్షణ శాఖ పేర్కొంది. సముద్రంలో నుంచి వ్యూహాత్మక దాడులు చేసే సామర్ధ్యం విషయంలో భారత్ కు ఇది కీలక ముందడుగుగా అభివర్ణించింది.
India test fires ballistic missile: ప్రతిష్టాత్మక ప్రాజెక్టు
ఈ అణ్వాయుధ సామర్ధ్య సబ్ మెరైన్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రొగ్రామ్ ను భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదట INS Arihant జలాంతర్గామిని అణ్వాయుధ సామర్ధ్య జలాంతర్గామిగా దేశీయంగా రూపొందించారు. అనంతరం INS Arighat ను రూపొందించారు. భారత్ లోనే తయారైన తొలి nuclear submarine ఐఎన్ ఎస్ అరిహంత్. దీన్ని 2009లో తయారు చేశారు.