తెలుగు న్యూస్  /  National International  /  'No Such Plan': Govt On Mp's Question To Limit Online Gaming To 3 Hours A Week

Online gaming: వారానికి మూడు గంటలే ఆన్ లైన్ గేమింగ్; ఈ టైమ్ లిమిట్ నిజమేనా?

HT Telugu Desk HT Telugu

15 March 2023, 19:43 IST

  • Limit Online gaming: చిన్న, పెద్ద తేడా లేకుండా అందరి సమయాలను నాశనం చేస్తున్న, ముఖ్యంగా చిన్న పిల్లలను బానిసలను చేసుకుంటున్న ఆన్ లైన్ గేమింగ్ కు టైమ్ లిమిట్ పెట్టాలని కేంద్రం యోచిస్తోందా? వారానికి మూడు గంటలు మాత్రమే ఆన్ లైన్ గేమింగ్ కు అవకాశమివ్వాలని భావిస్తోందా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Limit Online gaming time: చిన్న పిల్లలను బానిసలను చేసుకుంటున్న ఆన్ లైన్ గేమింగ్ (Online gaming) పై కేంద్రం స్పందించింది. ఆన్ లైన్ గేమింగ్ (Online gaming) కు టైమ్ లిమిట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలకు వివరణ ఇచ్చింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ బుధవారం పార్లమెంట్లో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

Limit Online gaming time: ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు..

ఆన్ లైన్ గేమింగ్ (Online gaming) ను వారానికి మూడు గంటలకు పరిమితం చేయాలన్న ఆలోచన ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ స్పష్టం చేశారు. అయితే, ఆన్ లైన్ గేమింగ్ (Online gaming) వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలపై, సవాళ్లపై ప్రభుత్వానికి అవగాహన ఉందని వివరించారు. స్వేచ్ఛాయుత, సురక్షిత, విశ్వసనీయ, పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన ఇంటర్నెట్ సేవలు పౌరులకు అందాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన లోక్ సభ కు వివరించారు.

Limit Online gaming time: పిల్లలపై పెను ప్రభావం

ఆన్ లైన్ గేమింగ్ (Online gaming) వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతోంది పిల్లలే. వారి విలువైన సమయాన్ని ఈ ఆన్ లైన్ గేమింగ్ వల్ల కోల్పోవడమే కాకుండా, శారీరక శ్రమకు దూరమై చిన్న వయస్సులోనే లైఫ్ స్టైల్ వ్యాధుల బారిన పడుతున్నారు. మానసికంగా కూడా పిల్లలపై ఈ హింసాత్మక గేమ్స్ (violent Online games) తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అయితే, ఆన్ లైన్ గేమ్స్ (violent Online games) తో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు, ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వానికి అవగాహన ఉందని కేంద్ర మంత్రి రాజీవ్ తెలిపారు. అలాగే, ఆన్ లైన్ గేమింగ్ (Online gaming) కు సమయ పరిమితి విధించాలన్న ఆలోచన మాత్రం ప్రస్తుతానికి ప్రభుత్వానకిి లేదన్నారు.

China restricts Online gaming time: చైనాలో ఆన్ లైన్ గేమింగ్ కు టైమ్ లిమిట్

ఖజురహో ఎంపీ విష్ణు దత్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ వివరణ ఇచ్చారు. చైనాలో ఆన్ లైన్ గేమింగ్ (Online gaming) కుసమయ పరిమితి విధించారని, అక్కడ వారానికి మూడు గంటలు మాత్రమే ఆన్ లైన్ లో గేమ్స్ ఆడే అవకాశం ఉంటుందని, ఈ నిబంధనను అక్కడి గేమింగ్ వెబ్ సైట్స్ (Online gaming websites) కచ్చితంగా పాటిస్తాయని ఎంపీ విష్ణు దత్ శర్మ వివరించారు. చైనా తరహాలో భారత్ లోనూ ఆన్ లైన్ గేమింగ్ కు టైమ్ లిమిట్ పెట్టాలని సూచించారు. 2021 లో చైనా ఆన్ లైన్ గేమ్స్ (Online games) పై పలు ఆంక్షలు విధించింది. మైనర్లకు శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో రోజుకు గంట మాత్రమే ఆన్ లైన్ గేమ్స్ (Online games) ఆడుకోవడానికి వీలు కల్పించాలని గేమింగ్ వెబ్ సైట్స్ కు, గేమింగ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.