తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Old Pension Scheme: పాత పెన్షన్ విధానం కోసం ఉద్యోగుల భారీ కార్యాచరణ: ఢిల్లీలో కూడా..

Old Pension Scheme: పాత పెన్షన్ విధానం కోసం ఉద్యోగుల భారీ కార్యాచరణ: ఢిల్లీలో కూడా..

27 March 2023, 23:18 IST

google News
  • Old Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమలు చేస్తున్న సీపీఎస్‍ను రద్దు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది NMOPS. భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.

Old Pension Scheme: పాత పెన్షన్ విధానం కోసం ఉద్యోగుల భారీ కార్యాచరణ
Old Pension Scheme: పాత పెన్షన్ విధానం కోసం ఉద్యోగుల భారీ కార్యాచరణ

Old Pension Scheme: పాత పెన్షన్ విధానం కోసం ఉద్యోగుల భారీ కార్యాచరణ

Old Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని (Old Pension Scheme - OPS) పురుద్ధరించాలనే డిమాండ్‍తో ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నేషనల్ మూవ్‍మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (NMOPS) నిర్ణయించుకుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న సీపీఎస్‍ను రద్దు చేసి ఓపీఎస్‍ను మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హైదరాబాద్‍తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలను NMOPS నాయకులు ప్రకటించారు. ఆగస్టు 23వ తేదీన హైదరాబాద్‍లో రాజకీయ రణరంగ మహాసభ నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణవ్యాప్తంగా చేపట్టబోయే కార్యక్రమాలను వెల్లడించారు. ఎన్ఎంఓపీఎస్ జాతీయ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ నేతృత్వంలో హైదరాబాద్‍లో అత్యవసర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ సోమవారం జరిగింది. ఉద్యోగులకు ఓపీఎస్ (OPS)ను మళ్లీ అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న భవిష్యత్ కార్యాచరణను స్థితప్రజ్ఞ ఈ సమావేశంలో వెల్లడించారు.

ఢిల్లీలో పెన్షన్ శంఖ్‍ నాద్

Old Pension Scheme: పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఆగస్టు 23వ తేదీన హైదరాబాద్ వేదికగా ఉద్యోగులతో రాజకీయ రణరంగ మహాసభను నిర్వహించనున్నట్టు స్థితప్రజ్ఞ తెలిపారు. అక్టోబర్ 1వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో పెన్షన్ శంఖ్ నాద్ పేరిట ఆందోళన నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా NMOPS సంఘ సభ్యత్వ నమోదును చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రమాద బీమాను కూడా ఉచితంగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు స్థితప్రజ్ఞ తెలిపారు.

రాష్ట్రంలో ఇలా..

Old Pension Scheme: పాత పెన్షన్ విధానం అమలు కోసం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని NMOPS రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. ఏప్రిల్ 16వ తేదీన తెలంగాణలోని 33 జిల్లా కేంద్రాల్లో కాన్‍ట్యూషనల్ మార్చ్ పేరిట ర్యాలీలు నిర్వహిస్తామని, మే నెలలో నినాదాలతో కూడిన చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. జూన్ రెండో వారంలో పాత పెన్షన్ సంకల్ప సాధన యాత్ర కోసం డివిజన్‍ల వారీగా సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఓపీఎస్ సాధన కోసం జూలై మొదటి వారంలో రాష్ట్రమంతా పాత పెన్షన్ సాధన సంకల్ప బస్సు యాత్ర చేస్తామని తెలిపారు.

ఉద్యోగులకు కనీస పెన్షన్ హామీ లేని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‍(CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) తీసుకొచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేదేలేదని స్థితప్రజ్ఞ స్పష్టం చేశారు. సీపీఎస్ లోపభూయిష్టంగా ఉందని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసునని, అందుకే దీనిపై కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని చెప్పారు. స్టాక్ మార్కెట్‍పై ఆధారపడే సీపీఎస్ సరైనది కాదని, పాలకులు ఇప్పటికైనా దీన్ని గుర్తించాలని అన్నారు. ఉద్యోగులకు ఓపీఎస్‍ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు.

ఈ అత్యవసర కౌన్సిల్ మీటింగ్‍లో NMOPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్ గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు, 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

తదుపరి వ్యాసం