తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nlc India Limited Recruitment 2024: 632 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

NLC India Limited Recruitment 2024: 632 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

HT Telugu Desk HT Telugu

15 January 2024, 16:12 IST

  • ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ఏడాది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు జనవరి 18 నుంచి జనవరి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తులు కోరుతున్న ఎన్‌సీఎల్ ఇండియా లిమిటెడ్
అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తులు కోరుతున్న ఎన్‌సీఎల్ ఇండియా లిమిటెడ్

అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తులు కోరుతున్న ఎన్‌సీఎల్ ఇండియా లిమిటెడ్

ఎన్‌సీఎల్ ఇండియా లిమిటెడ్ ఏడాది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం 2019/2020/2021/2022 & 2023 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్ / డిప్లొమా ఉత్తీర్ణులైన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 18న ప్రారంభమవుతుందని, దరఖాస్తు ఫామ్ సమర్పించడానికి చివరి తేదీ జనవరి 31 అని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు www.nlcindia.in అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరి 19న ఎల్ అండ్ డీసీ నోటీసు బోర్డు, ఎన్ ఎల్‌సీఐఎల్ వెబ్ సైట్ లో ప్రదర్శిస్తారు.

ఎన్‌‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2024 ఖాళీల వివరాలు: ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో 632 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు 314, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ పోస్టులు 318 ఉన్నాయి.

ఎన్సిఎల్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2024: ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి

www.nlcindia.in అధికారిక వెబ్సైట్ సందర్శించండి

కెరీర్స్ పేజీని తెరవడానికి కెరీర్స్ లింక్‌పై క్లిక్ చేయండి.

ట్రైనీస్ & అప్రెంటీస్ ట్యాబ్ ఎంచుకోండి.

అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.

అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.

దరఖాస్తు ఫారం సమర్పించిన తర్వాత అభ్యర్థులు పోస్టు ద్వారా రిజిస్ట్రేషన్ ఫారాలను

జనరల్ మేనేజర్,

లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్,

ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్‌

నైవేలి - 607 803 చిరునామాకు సమర్పించాలి.

లేదా లెర్నింగ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ లోని కలెక్షన్ బాక్స్‌లో 06.02.2023 సాయంత్రం 5.00 గంటలకు సమర్పించడం ద్వారా సమర్పించాలి.

నోటిఫికేషన్ ఇక్కడ..

నోటిఫికేషన్ వివరాలకు ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.

తదుపరి వ్యాసం