N.Korea flies warplanes near S.Korea: కొరియాల మధ్య యుద్ధ మేఘాలు
06 October 2022, 23:16 IST
- N.Korea flies warplanes near S.Korea: దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా, దక్షిణ కొరియా సరిహద్దుల్లోకి 12 యుద్ధ విమానాలను ఉత్తర కొరియా పంపించింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
N.Korea flies warplanes near S.Korea: దాయాది దేశాలైన ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తుండడంతో, దక్షిణ కొరియా కూడా దీటుగా స్పందించింది.
N.Korea flies warplanes near S.Korea: యుద్ధ విమానాలు
12 యుద్ధ విమానాలను దక్షిణ కొరియా సరిహద్దుల్లోకి పంపించింది ఉత్తర కొరియా. వాటిలో ఎనిమిది ఫైటర్ జెట్స్, 4 బాంబర్స్ ఉన్నాయి. అవి దక్షిణ కొరియా సరిహద్దుల్లో విన్యాసాలు చేశాయి. దీన్ని అత్యంత అసాధారణ చర్యగా భావిస్తున్నారు. దాంతో, వెంటనే స్పందించిన దక్షిణ కొరియా వెంటనే సరిహద్దుల్లో 30 మిలటరీ విమానాలను సిద్ధం చేసింది. అయితే, రెండు దేశాల యుద్ధ విమానాల మధ్య ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోలేదు.
N.Korea flies warplanes near S.Korea: మిస్సైల్స్ పరీక్ష
ఒకవైపు యుద్ధ విమానాలతో రెచ్చగొడ్తూనే, ఉత్తర కొరియా గురువారం రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఇటీవల ఉత్తర కొరియా వరుసగా మిస్సైల్స్ ను పరీక్షిస్తోంది. వారం క్రితం అణ్వాయుధ సామర్ధ్యం కలిగిన ఒక క్షిపణిని ప్రయోగించింది. దాంతో, అమెరికా కొరియా జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకను మోహరించింది. అలాగే, దక్షిణ కొరియా, జపాన్, అమెరికాలు వెంటనే సంయుక్తంగా మిలటరీ విన్యాసాలు చేపట్టాయి.