తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nitin Gadkari's Anecdote: ‘‘బావిలోనైనా దూకుతా కానీ.. కాంగ్రెస్ లో చేరనన్నాను’’: గడ్కరీ జ్ఞాపకం

Nitin Gadkari's anecdote: ‘‘బావిలోనైనా దూకుతా కానీ.. కాంగ్రెస్ లో చేరనన్నాను’’: గడ్కరీ జ్ఞాపకం

HT Telugu Desk HT Telugu

17 June 2023, 18:57 IST

google News
  • Nitin Gadkari's anecdote: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ తాను రాజకీయాల్లో చేరిన నాటి తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ లో చేరతే మంచి భవిష్యత్తు ఉంటుందని సలహా ఇచ్చిన నాయకుడికి తానిచ్చిన జవాబును గుర్తు చేసుకున్నారు.

కేంద్ర మంత్రి నితిన గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన గడ్కరీ (PTI)

కేంద్ర మంత్రి నితిన గడ్కరీ

Nitin Gadkari's anecdote: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని భండారాలో జరిగిన ఒక కార్యక్రమంలో శనివారం నితిన్ గడ్కరీ పాల్గొన్నారు.

మోదీ దార్శనిక నేత

గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత సమర్దవంతంగా పని చేస్తోందని గడ్కరీ కొనియాడారు. గొప్ప దార్శనికతతో భారత్ ను సూపర్ పవర్ గా తీర్చిదిద్దుతున్నారని ప్రధాని మోదీని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రశంసించారు. భారత్ ను ఆర్థికంగా తిరుగులేని శక్తిగా మోదీ మారుస్తున్నారన్నారు. కాంగ్రెెస్ గత 60 ఏళ్లల్లో చేసిన అభివృద్ధికి రెండింతల అభివృద్ధిని మోదీ తొమ్మిదేళ్లలో చేసి చూపించాడని ప్రధాని మోదీని ప్రశంసించారు. ఈ సందర్బంగా బీజేపీలో చేరిన కొత్తలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని గడ్కరీ గుర్తు చేసుకున్నారు.

కాంగ్రెస్ లో చేరమంటే బావిలో దూకుతానన్నా..

మహారాష్ట్రలో సీనియర్ నాయకుడు శ్రీకాంత్ జిశ్చికర్ బీజేపీ కార్యకర్తగా ఉన్న తనను కాంగ్రెస్ లో చేరమని సలహా ఇచ్చాడని గడ్కరీ గుర్తు చేసుకున్నారు. ‘‘నువ్వు మంచి కార్యకర్తవు. కష్టపడి పని చేస్తున్నావు. మంచి నాయకత్వ లక్షణాలున్నాయి. అందువల్ల నువ్వు కాంగ్రెస్ లో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుంది.’’ అని శ్రీకాంత్ జిశ్చికర్ తనకు సలహా ఇచ్చాడని, అయితే, అందుకు తాను ‘‘ బావిలో నైనా దూకుతా కానీ.. కాంగ్రెస్ లో మాత్రం చేరను. బీజేపీ పై, బీజేపీ సిద్ధాంతాలపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆ పార్టీ కోసమే పని చేస్తాను’’ అని బదులిచ్చానని గడ్కరీ వివరించారు.

తదుపరి వ్యాసం