తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Six Airbags Mandatory : 8 సీటర్ కార్లలో 6 ఎయిర్ బ్యాగులు మస్ట్.. ఎప్పటి నుంచంటే

Six airbags mandatory : 8 సీటర్ కార్లలో 6 ఎయిర్ బ్యాగులు మస్ట్.. ఎప్పటి నుంచంటే

HT Telugu Desk HT Telugu

28 June 2022, 9:14 IST

google News
    • Six airbags mandatory : 8 సీటర్ల కార్లు, ఇతర పాసింజర్ వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి చేస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీచేశామని, ఇందులో మార్పులు ఉండవని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
8 సీటర్ కార్లలో 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి
8 సీటర్ కార్లలో 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి (HT PHOTO)

8 సీటర్ కార్లలో 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి

న్యూఢిల్లీ, జూన్ 28: ఎనిమిది మంది వరకు ప్రయాణించే మోటారు వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌‌లు ఉండేలా ప్రభుత్వం తప్పనిసరి చేస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

'ఇంటెల్ ఇండియాస్ సేఫ్టీ పయనీర్స్ కాన్ఫరెన్స్ 2022'ని ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా ఏటా 5 లక్షల ప్రమాదాల్లో 1.5 లక్షల మంది చనిపోతున్నారు. మోటారు వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరిగా అందించాలని నిర్ణయించాం. ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం..’ అని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి తెలిపారు.

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖమోటారు వాహనాలలో ప్రయాణించేవారి భద్రతను మెరుగుపరచడానికి సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989ని సవరించడం ద్వారా భద్రతా లక్షణాలను మెరుగుపరచాలని నిర్ణయించినట్లు తెలిపింది.

‘జనవరి 14, 2022న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీని ప్రకారం అక్టోబర్ 1, 2022 తర్వాత తయారయ్యే కేటగిరీ ఎం1 వాహనాలకు ముందు వరుసలో ఔట్‌బోర్డ్ సీటింగ్‌లో ఉన్న వ్యక్తులకు ఒక్కొక్కటి రెండు వైపులా సైడ్ ఎయిర్ బ్యాగ్ లేదా టోర్సో ఎయిర్ బ్యాగ్‌లు అమర్చాలి. అలాగే ఔట్ బోర్డ్ సీటింగ్ పొజిషన్‌లో ఉన్న వారికి రెండు వైపులా కర్టెన్ ఎయిర్ బ్యాగ్ లేదా ట్యూబ్ ఎయిర్ బ్యాగ్‌లు ఒక్కొక్కటి అమర్చాలి..’ అని పేర్కొంది.

కారు దేన్నైనా ఢీకొట్టినప్పుడు, కారును ఏదైనా ఢీకొట్టినప్పుడు ఈ ఎయిర్ బ్యాగులు వ్యక్తికి, వాహనపు డ్యాష్ బోర్డుకు మధ్య అకస్మాత్తుగా తెరుచుకుని బలమైన గాయాలు కాకుండా కాపాడుతాయి.

‘ప్రయాణికుల భద్రత కోసం తెచ్చే ఈ నిబంధన అమలుకు ఆటోమొబైల్ పరిశ్రమతో సహా అన్ని వర్గాల సహకారం అవసరం.?’ అని గడ్కరీ పేర్కొన్నారు.

అధిక పన్నులు, కఠినమైన భద్రత, ఉద్గార నిబంధనలు తమ ఉత్పత్తులను ఖరీదైనవిగా మార్చాయని ఆటోమొబైల్ పరిశ్రమ ఆందోళనలను లేవనెత్తుతున్న నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతర్జాతీయ ఆటోమొబైల్ బ్రాండ్లన్నీ భారతదేశంలో అందుబాటులో ఉన్నాయని గడ్కరీ చెప్పారు.

సురక్షితమైన రహదారులు చాలా ముఖ్యమని పేర్కొన్న మంత్రి.. మోటారు వాహనాల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం సవాలేనని అంగీకరించారు.

2024 నాటికి భారతీయ రహదారి మౌలిక సదుపాయాలు అమెరికాతో సమానంగా ఉంటాయని మంత్రి పునరుద్ఘాటించారు.

టాపిక్

తదుపరి వ్యాసం