తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Irctc: ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో మార్పులు.. ఇకపై అలా చేయాల్సిందే

IRCTC: ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో మార్పులు.. ఇకపై అలా చేయాల్సిందే

HT Telugu Desk HT Telugu

12 May 2022, 11:33 IST

google News
    • ఆన్‌లైన్‌ రైల్వే టికెట్‌ బుకింగ్‌లో పలు మార్పులు చేసింది ఐఆర్‌సీటీసీ. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. టిక్కెట్ బుకింగ్ కోసం మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీలను ధ్రువీకరించటం తప్పనిసరి(mandatory) చేసింది.
ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో మార్పులు
ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో మార్పులు

ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో మార్పులు

New online IRCTC ticket booking rules: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా రైల్వే టికెట్ బుకింగ్ ప్రక్రియను సవరించారు. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించింది. టికెట్ బుక్ చేసుకునే ముందు వారి మొబైల్ నంబర్ తో పాటు ఈ-మెయిల్ ఐడీలను ధ్రువీకరించడం తప్పనిసరి చేసింది. ఫలితంగా వెరిఫికేషన్ లేకుండా యూజర్లు టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండదని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. 

ఇలా ధ్రువీకరించుకోవచ్చు..

Step 1: ముందుగా ఐఆర్‌సీటీసీ యాప్‌ లేదంటే వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ వెరిఫికేషన్‌ విండో కనిపిస్తుంది.

Step 2: సూచించిన కాలంలో మొబైల్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీని నమోదు చేయాలి.

Step 3: ఐడీలను నమోదు చేయగా.. వెరిఫై అనే బటన్ ను నొక్కాలి.

Step 4: వన్‌ టైం పాస్‌వర్డ్‌(OTP) మొబైల్‌ నెంబర్‌ / మెయిల్‌ ఐడీకి వస్తుంది.

Step 5: ఆపై వెరిఫై ద్వారా ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

వెరిఫికేషన్‌ ప్రక్రియ తర్వాత ఐఆర్‌సీటీసీ పోర్టల్‌ లేదా యాప్‌కు వెళ్లాలి. రైల్వే స్టేషన్‌, తేదీ, ఇతర వివరాలను నమోదు చేయాలి. బుక్‌ నౌ మీద క్లిక్‌ చేసి.. ప్రయాణికుల వివరాలు.. ఇతర వివరాలు పొందుపర్చాలి. పేమెంట్‌ ఆప్షన్‌ పూర్తయ్యాక.. అప్పుడు కన్ఫర్మేషన్‌ వివరాలు వస్తాయి.

టాపిక్

తదుపరి వ్యాసం