NEET UG 2022 results links: నీట్ యూజీ రిజల్ట్స్ విడుదల.. డైరెక్ట్ లింక్స్ ఇవే..
08 September 2022, 1:47 IST
- NEET UG 2022 results links: నీట్ యూజీ 2022 రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఫలితాల కోసం నేరుగా ఈ కింది లింక్స్ ఓపెన్ చేయండి.
జూలై 17న జరిగిన నీట్ యూజీ 2022 పరీక్షకు హాజరైన విద్యార్థులు (ప్రతీకాత్మక చిత్రం)
NEET UG 2022 results links: నీట్ యూజీ 2022 రిజల్ట్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బుధవారం రాత్రి విడుదల చేసింది. రాజస్థాన్‌కు చెందిన తనిష్క మొదటి ర్యాంకు వచ్చింది. దిల్లీకి చెందిన వత్స ఆశీష్ బాత్రాకు రెండో ర్యాంకు, తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థ్ రావు ఐదో ర్యాంకు సాధించాడు.
టాప్ 10 ర్యాంకులు సాధించింది లిస్ట్ చూసుకుంటే. మెదుటి ర్యాంకు తనిష్క (రాజస్థాన్), ఆ తర్వాతి స్థానాల్లో వత్స ఆశీష్ బాత్రా (దిల్లీ), హృషికేశ్ నాగ్‌భూషణ్ గంగూలే (కర్ణాటక), రుచా పవాశి (కర్ణాటక), ఎర్రబెల్లి సిద్ధార్థ్ రావు (తెలంగాణ), రిషి వినయ్ బాల్సే (మహారాష్ట్ర), అర్పిత నారంగ్ (పంజాబ్), కృష్ణ ఎస్‌ఆర్ (కర్ణాటక), జీల్ విపుల్ వ్యాస్ (గుజరాత్), హాజిక్ పర్వీజ్ లోన్ (జమ్మూకశ్మీర్) వరుసగా టాప్ టెన్ లో ఉన్నారు. విద్యార్థులు నీట్ రిజల్ట్స్ ఈ కింది డైరెక్ట్ లింక్స్‌లో తెలుసుకోవచ్చు.
నీట్ రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే..
నీట్ యూజీ 2022 పరీక్షలు జులై 17న నిర్వహించారు. అభ్యర్థులు నీట్ యూజీ ఆన్సర్ కీపైన అభ్యంతరాలను లేవనెత్తేందుకు సెప్టెంబరు 2 వరకు గడువు ఇచ్చారు.
నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (యూజీ) పరీక్షలకు 18,72,343 మంది విద్యార్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 497 నగరాల్లో 3,570 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించారు.
నీట్ యూజీ 2022 రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవాలి
step 1: నీట్ అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి.
step 2: హోం పేజీ సందర్శించి నీట్ యూజీ స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ లింక్ క్లిక్ చేయాలి.
step 3: మీ లాగిన్ డీటైల్స్ ఇచ్చి మీ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి.
step 4: భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసిపెట్టుకోవాలి.
నీట్ యూజీ విద్యార్థుల ఆందోళన..
కాగా నీట్ యూజీ రాసిన విద్యార్థుల్లో కొందరు తమ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లు టాంపర్ అయ్యాయని, తమవి కానివి తమకు దక్కాయని ఆందోళన వ్యక్తంచేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆశ్రయించారు. ఈమేరకు కొందరు డీజీ ఎన్టీఏకు ట్వీట్ చేశారు.