Microsoft CEO childhood: ‘‘చదువంటేనే ఆసక్తి ఉండకపోయేది..: మైక్రోసాఫ్ట్ సీఈఓ’’
08 January 2024, 19:59 IST
Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల. భారతీయుడు. హైదరాబాద్ లో చదువుకున్నాడు. తన బాల్యం గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు.
Satya Nadella, chief executive officer, Microsoft.
Satya Nadella recalls childhood: సత్య నాదెళ్ల తన జీవిత విశేషాలను లింక్డ్ ఇన్ లో పంచుకున్నారు. తన తండ్రి ఐఏఎస్ అధికారి, ఆర్థిక వేత్త అని, తల్లి సంస్కృతంలో ప్రొఫెసర్ అని వివరించారు. తన బాల్యం హైదరాబాద్ లో గడిచిందని వెల్లడించారు. తమది మధ్య తరగతి జీవన విధానమేనని వివరించారు.
Satya Nadella recalls childhood: హెచ్ పీ ఎస్ స్టుడెంట్
సత్య నాదెళ్ల 1967లో జన్మించారు. తండ్రి ఐఏఎస్ అధికారి. ఆర్థికవేత్త. తల్లి సంస్కృతంలో ప్రొఫెసర్. తన తల్లిదండ్రులిద్దరికీ ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం ఉండేది కాదని సత్య నాదెళ్ల గుర్తు చేసుకున్నారు. కానీ, తనకు స్వేచ్ఛ ను ఇచ్చే విషయంలో మాత్రం వారు ఏకాభిప్రాయమే వ్యక్తం చేసేవారని తెలిపారు. తన స్కూలింగ్ అంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ల గడిచిందన్నారు. సత్య నాదెళ్ల హైదరాబాద్ విశేషాలు.. ఆయన మాటల్లోనే..
Satya Nadella recalls childhood: రోజంతా క్రికెటే..
- చిన్నప్పుడు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. రోజంతా ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడుతుండేవాడిని.
- మా అమ్మ సంస్కృతంలో ప్రొఫెసర్. నాన్న ఐఏఎస్ అధికారి. వారిద్దరి భావజాలాలు వేరు. వారిమధ్య ఎప్పుడూ భిన్నాభిప్రాయాలే వ్యక్తమవుతుండేవి. కానీ, ఒక్క నా విషయంలో మాత్రం ఇద్దరిదీ ఒకే మాట. నా స్వేచ్ఛకు వారు ఎప్పుడు అడ్డుపడలేదు. నా మీద ఇద్దరికీ చాలా నమ్మకముండేది. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉండడంలో, నా వ్యక్తిత్వ రూపకల్పనలో వారి పాత్ర చాలా కీలకం.
- మణిపాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశారు. ఆ తరువాత అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ చేశాను.
- తొలిసారి కంప్యూటర్ ను చూసిన జ్ఞాపకం నాకింకా ఉంది. కంప్యూటర్ తో నా స్నేహం తొలి చూపునుంచే ప్రారంభమైంది.
- మొదట సన్ మైక్రో సిస్టమ్స్ (Sun Microsystems) లో జాబ్ చేశాను. ఆ తరువాత 1992లో మైక్రోసాఫ్ట్ లో చేరాను. మైక్రోసాఫ్ట్ తో నాది 30 ఏళ్ల అనుబంధం.
టాపిక్