తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sudha Murty: ‘‘నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది..’’

Sudha Murty: ‘‘నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది..’’

HT Telugu Desk HT Telugu

28 April 2023, 14:29 IST

  • Sudha Murty: బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆయన కుటుంబం గురించి సునక్ అత్తగారు, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి (Sudha Murty) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రిషి సునక్, సుధా మూర్తి
రిషి సునక్, సుధా మూర్తి

రిషి సునక్, సుధా మూర్తి

Sudha Murty: బ్రిటన్ ప్రధాని రిషి సునక్ (Rishi Sunak), ఆయన కుటుంబం గురించి సునక్ అత్తగారు, ఇన్ఫోసిస్ (Infosys) కో ఫౌండర్ నారాయణ మూర్తి (Narayana Murthy) భార్య సుధా మూర్తి (Sudha Murty) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Sudha Murty about her husband: నేను నా భర్తను వ్యాపారవేత్తను చేశాను..

తన భర్తను తాను వ్యాపారవేత్తను చేశానని, తన కూతురు అక్షత మూర్తి (Akshata Murty) మాత్రం తన భర్తను బ్రిటన్ దేశానికి ప్రధానిని చేసిందని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి (Sudha Murty) వ్యాఖ్యానించారు. నారాయణ మూర్తి (Narayana Murthy) , సుధా మూర్తి దంపతుల కూతురు అక్షత మూర్తి (Akshata Murty) భర్త బ్రిటన్ ప్రధాని రిషి సునక్ (Rishi Sunak) అన్న విషయం తెలిసిందే. రిషి సునక్ , అక్షత మూర్తి (Akshata Murty) 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు. రిషి సునక్ (Rishi Sunak) జీవితాన్ని తన కూతురు అక్షత మూర్తి ఎన్నో విధాలుగా ప్రభావితం చేసిందని సుధామూర్తి (Sudha Murty) వెల్లడించారు. ముఖ్యంగా రిషి ఆహార అలవాట్లను మార్చడం, మత విశ్వాసాలన పెంపొందించడం వంటివి చేసిందని తెలిపారు. రిషి సునక్ (Rishi Sunak) అత్యంత చిన్న వయస్సులోనే బ్రిటన్ వంటి దేశానికి ప్రధాని అయ్యారని, రిషి సునక్ (Rishi Sunak) ఎదుగుదల వెనుక తన కూతురు అక్షత మూర్తి (Akshata Murty) ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉందని సుధామూర్తి వెల్లడించారు. ‘నేను నా భర్తను బిజినెస్ మ్యాన్ ను చేశాను. నా కూతురు తన భర్తను దేశానికి ప్రధానిని చేసింది. చిన్న వయస్సులోనే రిషి సునక్ (Rishi Sunak) బ్రిటన్ ప్రధాని కాగలిగారంటే అందుకు నా కూతురు అక్షత మూర్తే కారణం.’ అని Sudha Murty గర్వంగా తెలిపారు.

Raghavendra Swami devotees: గురువారం ప్రత్యేకత..

రిషి సునక్ (Rishi Sunak) పూర్వీకులు సుమారు 150 ఏళ్ల క్రితమే బ్రిటన్ కు వలస వెళ్లారని సుధా మూర్తి వెల్లడించారు. అయినా, వారి కుటుంబం ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా జీవిస్తుంటారని, మత విశ్వాసాలను పాటిస్తూ ఉంటారని సుధామూర్తి తెలిపారు. గురువారం తమకు ఎంతో పవిత్రమైన రోజు అని వెల్లడించారు. అన్ని ముఖ్యమైన పనులను గురువారమే తాము ప్రారంభిస్తామన్నారు. తమ కుటుంబమంతా రాఘవేంద్ర స్వామి భక్తులమని తెలిపారు. ఇన్ఫోసిన్ (Infosys) ను కూడా గురువారమే ప్రారంభించామని గుర్తు చేసుకున్నారు. తన అల్లుడు రిషి సునక్ (Rishi Sunak) ప్రతీ గురువారం ఉపవాసం ఉంటాడని వెల్లడించారు.

తదుపరి వ్యాసం