తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Girl Dies Of Heart Attack : గుండెపోటుతో .. 16ఏళ్లకే బాలిక మృతి- చలి తీవ్రతతో!

Girl dies of heart attack : గుండెపోటుతో .. 16ఏళ్లకే బాలిక మృతి- చలి తీవ్రతతో!

28 January 2023, 6:52 IST

  • Girl dies of heart attack : గుండెపోటు కారణంగా 16ఏళ్ల ఓ బాలిక మరణించిన ఘటన మధ్యప్రదేశ్​లోని ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. చలి తీవ్రత కారణంగా ఆమెకు గుండెపోటు వచ్చి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.

గుండెపోటుతో 16ఏళ్లకే బాలిక మృతి.. స్కూల్​లో ఒక్కసారిగా..!
గుండెపోటుతో 16ఏళ్లకే బాలిక మృతి.. స్కూల్​లో ఒక్కసారిగా..!

గుండెపోటుతో 16ఏళ్లకే బాలిక మృతి.. స్కూల్​లో ఒక్కసారిగా..!

Girl dies of heart attack : మధ్యప్రదేశ్​లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చలి తీవ్రత మధ్య స్కూల్​కు వెళ్లిన ఓ 16ఏళ్ల బాలిక.. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది!

ఇదీ జరిగింది..

ఇండోర్ ఉషా నగర్​ ప్రాంతంలో బుధవారం జరిగింది ఈ ఘటన. గురువారం రిపబ్లిక్​ డే కారణంగా.. డ్యాన్స్​ ప్రాక్టీస్​ చేసేందుకు బుధవారం స్కూల్​కు వెళ్లింది వ్రిందా త్రిపాఠీ. అక్కడ ఆమె 11వ తరగతి చదువుకుంటోంది. అప్పటి వరకు ఆమె చురుకుగానే ఉంది. స్నేహితులను కలిసి మాట్లాడింది.

Madhya Pradesh Girl dies of heart attack : కానీ.. ఒక్కసారిగా ఆ బాలిక కుప్పకూలిపోయింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు.

"వ్రిందాకు సీపీఆర్​ ఇచ్చాము. ఆమె స్పందించలేదు. అన్ని రకాలుగానూ ప్రయత్నించాము. కానీ ఫలితం దక్కలేదు. ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే ఆమె ప్రాణాలు విడిచింది," అని వైద్యులు వెల్లడించారు.

Heart attack in winter season : బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించగా.. ఆమె ముఖం మీద గాయమైనట్టు రిపోర్టు పేర్కొంది. గుండెపోటు కారణంగా.. ఒక్కసారింగా నేల మీద పడటంతో ఆ దెబ్బ తగిలి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.

వ్రిందాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆమె బంధువు రాఘవేంద్ర త్రిపాఠీ మీడియాకు వెల్లడించారు. చలి తీవ్రత కారణంగా ఆమెకు గుండెపోటు వచ్చి ఉంటుందని డాక్టర్లు చెప్పినట్టు వివరించారు.

నేత్రదానం..

కష్టకాలంలోనూ వ్రిందా కుటుంబం గొప్ప మనసును చాటుకుంది! మరణించిన బిడ్డ కళ్లను దానం చేసింది. ఈ విషయాన్ని ఇండోర్​ సొసైటీ ఫర్​ ఆర్గన్​ డొనేషన్​ బృందం వెల్లడించింది.

చలి తీవ్రతతో గుండెపోటు..!

Heart attack in young age : మధ్యప్రదేశ్​తో పాటు దేశవ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉంటున్నాయి. ఈ సమయాల్లో బయటకు వెళితే.. ఒక్కొక్కరి శరీరంలోని హార్మోన్​లు ఒక్కో విధంగా స్పందిస్తాయని.. ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. అనిల్​ భరణి వెల్లడించారు. కొన్ని శరీరాల్లో హార్మోన్​లు ఒక్కసారిగా పెరిగిపోతాయని, ఫలితంగా రక్తం గడ్డకడుతుందని వివరించారు. చివరికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగ ఉండాలని డాక్టర్​ తెలిపారు. చలి తీవ్రత నుంచి గట్టెక్కాలంటో.. పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామాలు చేయాలని ప్రజలకు సూచించారు డా. అనిల్​ భరణి.

తదుపరి వ్యాసం