Delhi cold wave : పర్వత ప్రాంతాల కన్నా ఢిల్లీలోనే చలి తీవ్రత ఎక్కువ!-in pics delhi and north india freezes due to cold wave effect for fifth consecutive day ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Delhi Cold Wave : పర్వత ప్రాంతాల కన్నా ఢిల్లీలోనే చలి తీవ్రత ఎక్కువ!

Delhi cold wave : పర్వత ప్రాంతాల కన్నా ఢిల్లీలోనే చలి తీవ్రత ఎక్కువ!

Jan 09, 2023, 01:43 PM IST Chitturi Eswara Karthikeya Sharath
Jan 09, 2023, 01:43 PM , IST

Delhi cold wave : ఉత్తర భారతంలో కోల్డ్​ వేవ్​ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. వరుసగా ఐదో రోజు.. చలికి ఢిల్లీ గజగజలాడింది. పర్వత ప్రాంతాలు ఉండే హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ కన్నా.. ఢిల్లీలోనే చలి తీవ్రత ఎక్కువగా ఉండటం గమనార్హం. తాజా పరిణామాలతో ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో విమాన, రైలు, రోడ్డు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఢిల్లీలో సోమవారం ఉదయం పరిస్థితి ఇది. విజిబులిటీ చాలా తగ్గిపోయింది. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

(1 / 6)

ఢిల్లీలో సోమవారం ఉదయం పరిస్థితి ఇది. విజిబులిటీ చాలా తగ్గిపోయింది. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.(Sanchit Khanna/Hindustan Times)

చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు.. ఢిల్లీలోని చాలా మంది ఈ విధంగా మంటలు ఏర్పాటు చేసుకున్నారు.

(2 / 6)

చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు.. ఢిల్లీలోని చాలా మంది ఈ విధంగా మంటలు ఏర్పాటు చేసుకున్నారు.(Keshav Singh/Hindustan Times)

పొగమంచు కారణంగా విజిబులుటీ తగ్గిపోవడంతో 267 రైళ్లు , 30 విమానాలు ఆలస్యమయ్యాయి. ఢిల్లీలోని ఐదు విమానాలను దారి మళ్లించారు.

(3 / 6)

పొగమంచు కారణంగా విజిబులుటీ తగ్గిపోవడంతో 267 రైళ్లు , 30 విమానాలు ఆలస్యమయ్యాయి. ఢిల్లీలోని ఐదు విమానాలను దారి మళ్లించారు.(Sanchit Khanna/Hindustan Times)

పంజాబ్​లోని భిటిండాలో.. సోమవారం ఉదయం 5:30 గంటలకు విజిబులిటీ 0 మీటర్లకు పడిపోయింది. అమృత్​సర్​లో 25 మీటర్లు, అంబాలాలో 25 మీటర్ల విజిబులిటీ నమోదైంది. సఫ్దార్​జంగ్​లో విజిబులిటీ 25 మీటర్లకు పడిపోయింది.

(4 / 6)

పంజాబ్​లోని భిటిండాలో.. సోమవారం ఉదయం 5:30 గంటలకు విజిబులిటీ 0 మీటర్లకు పడిపోయింది. అమృత్​సర్​లో 25 మీటర్లు, అంబాలాలో 25 మీటర్ల విజిబులిటీ నమోదైంది. సఫ్దార్​జంగ్​లో విజిబులిటీ 25 మీటర్లకు పడిపోయింది.(Sanchit Khanna/Hindustan Times)

బహరైచ్​లో విజిబులుటీ.. 50 మీటర్లు, ప్రయాగ్​రాజ్​లో 50 మీటర్లు, బిహార్​ భగల్​పూర్​లో 25 మీటర్లు, పూర్ణియా, గయాలో 50 మీటర్లు, రాజస్థాన్​లోని గంగానగర్​లో 25 మీటర్లుగా నమోదైంది. ఈ వివరాలను ఐఎండీ వెల్లడించింది.

(5 / 6)

బహరైచ్​లో విజిబులుటీ.. 50 మీటర్లు, ప్రయాగ్​రాజ్​లో 50 మీటర్లు, బిహార్​ భగల్​పూర్​లో 25 మీటర్లు, పూర్ణియా, గయాలో 50 మీటర్లు, రాజస్థాన్​లోని గంగానగర్​లో 25 మీటర్లుగా నమోదైంది. ఈ వివరాలను ఐఎండీ వెల్లడించింది.(Keshav Singh/Hindustan Times)

పొగమంచు కారణంగా సోమవారం ఉదయం అమృత్​సర్​లో నెలకొన్న పరిస్థితులు.

(6 / 6)

పొగమంచు కారణంగా సోమవారం ఉదయం అమృత్​సర్​లో నెలకొన్న పరిస్థితులు.(ANI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు