తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mob Barges Into Madrasa, Performs Puja: మదరసాలో పూజలు చేసిన హిందుత్వ వాదులు

Mob barges into madrasa, performs puja: మదరసాలో పూజలు చేసిన హిందుత్వ వాదులు

HT Telugu Desk HT Telugu

07 October 2022, 20:42 IST

google News
  • Mob barges into madrasa, performs puja: కర్నాటకలో మత ఉద్రిక్తతలకు కారణమయ్యే ఘటన చోటు చేసుకుంది. మసీదు, మదరసా ఉన్న 15వ శతాబ్ది నాటి నిర్మాణంలోకి దూసుకు వెళ్లిన హిందుత్వ వాదులు అక్కడ పూజలు నిర్వహించారు. 

బీదర్ లోని మదరసా ఇ మహమ్మద్ గవాన్
బీదర్ లోని మదరసా ఇ మహమ్మద్ గవాన్

బీదర్ లోని మదరసా ఇ మహమ్మద్ గవాన్

Mob barges into madrasa, performs puja: కర్నాటకలోని బీదర్ లో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దసరా సందర్భంగా కొందరు స్థానికంగా ఉన్న మదరసా భవనంలోకి చొచ్చుకువెళ్లి, లోపల పూజలు నిర్వహించడం ఈ ఉద్రిక్తతలకు కారణమైంది.

Mob barges into madrasa, performs puja: 1472నాటి భవనం..

బీదర్ లోని మదరసా ఇ మహమ్మద్ గవాన్ ను క్వాజా మొహమ్మద్ జిలానీ(మొహమ్మద్ గవాన్) 1472లో నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఒక మదరసా, ఒక మసీదు, స్టాఫ్ క్వార్టర్స్, లైబ్రరీ మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రాంగణాన్ని హెరిటేజ్ సైట్ గా గుర్తించారు.

Mob barges into madrasa, performs puja: దసరా రోజు..

దసరా రోజు కొందరు యువకులు ఆ మదరసా ఉన్న ప్రాంతంలోకి సెక్యూరిటీ వారిని బెదిరించి, లోపలికి చొచ్చుకువెళ్లి, లోపల పూజలు నిర్వహించారు. జై భవానీదేవి, వందేమాతరం, జైహింద్ అని నినాదాలు చేశారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో, బీదర్ సహా కర్నాటక లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై ముస్లిం వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. మసీదు కమిటీ సభ్యుడు మొహమ్మద్ షఫియుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీదర్ లోని పలు సున్నిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

Mob barges into madrasa, performs puja: హోం మంత్రి వివరణ

ఈ ఘటనపై కర్నాటక హోం మంత్రి జ్ఞానేంద్ర వివరణ ఇచ్చారు. మదరసా ఉన్న ప్రాంగణంలో గతంలో ఒక జమ్మి చెట్టు ఉండేదని, ప్రస్తుతం ఆ చెట్టు లేనప్పటికీ.. ఆ చెట్టు ఉన్న గద్దె వద్ద దసరా రోజు కొబ్బరి కాయ కొట్టి పూజలు చేయడం చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ అని ఆయన వివరించారు. ఈ సంవత్సరం కూడా అలాగే వెళ్లారని, అయితే, గతంలో ఐదారుగురు మాత్రమే వెళ్లేవారని, ఈ సంవత్సరం ఎక్కువ మంది వెళ్లడంతో పాటు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వివాదాస్పదం అయిందని ఆయన వివరణ ఇచ్చారు.

తదుపరి వ్యాసం