తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Minor Girl Gangraped: అస్సాంలో బాలికపై సామూహిక అత్యాచారం

Minor girl gangraped: అస్సాంలో బాలికపై సామూహిక అత్యాచారం

HT Telugu Desk HT Telugu

20 February 2024, 19:01 IST

  • Assam crime news: అస్సాంలో దారుణం చోటు చేసుకుంది. ఒక బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిలో ఆ బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడిన వాడు కూడా ఉన్నారు. ఈ ఘటన ఫిబ్రవరి 15న జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Assam crime news: అస్సాంలోని కచార్ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికను కార్లో బలవంతంగా తీసుకువెళ్లి, కార్లో వెళ్తూనే గ్యాంగ్ రేప్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ నలుగురిలో ఒక వ్యక్తి ఆ బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి, పరిచయం పెంచుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

తెలిసిన వ్యక్తే..

ఈ ఘటన ఫిబ్రవరి 15న జరగ్గా, కొద్ది రోజుల తర్వాత బాలిక కుటుంబ సభ్యులు కచార్ లోని కచ్చుడారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నలుగురు నిందితుల్లో ఒకరైన 30 ఏళ్ల వ్యక్తి బాలికకు బాగా తెలిసినవాడని పోలీసులు తెలిపారు. ఇటీవలనే కారు కొనుగోలు చేసిన ఆ వ్యక్తి ఫిబ్రవరి 15న సాయంత్రం బాలికను కలుద్దామని పిలిచాడు. ఆమె అక్కడికి చేరుకున్న తర్వాత వారు ఆమెను వాహనంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

పోలీసు కేసు

బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆ నలుగురు నిందితులపై ఐపీసీ సెక్షన్ 376డీ, గ్యాంగ్ రేప్, 363 (కిడ్నాప్), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు కచ్చుదరం పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అధికారి ఆర్.నాథ్ తెలిపారు. నిందితులందరినీ గుర్తించామని, వారంతా పరారీలో ఉన్నందున వారి ఆచూకీ కోసం తమ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన మంగళవారం తెలిపారు. బాధితురాలైన బాలికకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని కఠినంగా శిక్షించాలని, వారిని విడిచిపెట్టవద్దని పోలీసులకు, న్యాయవ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నామని మైనర్ బాలిక తల్లి తెలిపారు.

తదుపరి వ్యాసం