Mindtree Q1 Results: 37.3 శాతం పెరిగిన మైండ్‌ట్రీ నికర లాభం
13 July 2022, 17:02 IST
- Mindtree Q1 Results: సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ మైండ్‌ట్రీ నికర లాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 471.6 కోట్లుగా ఉందని, అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే నికర లాభం 37.3 శాతం పెరిగిందని సంస్థ వెల్లడించింది.
37.3 శాతం పెరుగుదలతో నికర లాభం ప్రకటించిన మైండ్ ట్రీ
Mindtree Q1 Results: సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ మైండ్‌ట్రీ నికర లాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 471.6 కోట్లుగా ఉందని, అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే నికర లాభం 37.3 శాతం పెరిగిందని సంస్థ వెల్లడించింది.
జూలై 13న మైండ్‌ట్రీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి క్వార్టర్ ఆదాయ ఫలితాలు ప్రకటించింది.
కార్యకలాపాల నుంచి రెవెన్యూ రూ. 3,121.1 కోట్లుగా ఉండగా, అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 36.2 శాతం పెరిగింది.
‘2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో బలమైన ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఆర్థిక సంవత్సరం ఆరంభంలో పటిష్టమైన మార్జిన్, రికార్డుస్థాయిలో ఆర్డర్లు, పటిష్టమైన ఆదాయ వృద్ధి కనిపిస్తోంది..’ అని మైండ్‌ట్రీ ఎండీ, సీఈవో దేవాశిష్ ఛటర్జీ పేర్కొన్నారు.
5 శాతానికి పైగా రెవెన్యూ వృద్ధి నమోదు చేసిన క్వార్టర్లలో వరుసగా ఇది ఆరవదని తెలిపారు.
ఎబిటా మార్జిన్ 21.1 శాతంగా ఉందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఆర్డర్ బుక్ 570 మిలియన్ డాలర్లుగా ఉందని, జూన్ మాసాంతానికి 274 యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారని వివరించింది.
10 మిలియన్ డాలర్లకు పైగా ఆర్డర్లు ఉన్న ముగ్గురు కస్టమర్లు, అలాగే 20 మిలియన్ డాలర్లకు పైగా ఆర్డర్లు ఉన్న నలుగురు కస్టమర్లు పెరిగారని తెలిపింది.
కాగా బుధవారం మైండ్‌ట్రీ షేర్ ధర రూ. 1.64 శాతం పెరిగి 2,900.60 వద్ద స్థిరపడింది.
టాపిక్