తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Vice Presidential Election : విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి.. మార్గరేట్​ అల్వా

Vice presidential election : విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి.. మార్గరేట్​ అల్వా

Sharath Chitturi HT Telugu

17 July 2022, 17:14 IST

    • Vice presidential election : మాజీ కేంద్రమంత్రి మార్గరేట్​ అల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాయి విపక్షాలు.
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి.. మార్గరేట్​ అల్వా
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి.. మార్గరేట్​ అల్వా (Twitter)

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి.. మార్గరేట్​ అల్వా

Vice presidential election : ఆగస్ట్​ 6న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం తమ అభ్యర్థిని విపక్షాలు ప్రకటించాయి. మాజీ కేంద్రమంత్రి మార్గరేట్​ అల్వాను ఉపరాష్ట్రపతి ఎన్నిక రేసులో నిలబెట్టాయి.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

అధికార ఎన్​డీఏ తరఫు నుంచి పశ్చిమ్​ బెంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​ఖడ్​.. ఉపరాష్ట్రపతి ఎన్నిక పోటీలో నిలబడ్డారు.

ఎన్నిక జరిగే ఆగస్ట్​ 6నే ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్​డీఏకు మెజారిటీ ఉండటంతో.. ధన్​ఖడ్​ గెలుపు లాంఛనమే!

మార్గరేట్​ అల్వా ప్రస్తానం..

Margaret Alva : 1942 ఏప్రిల్​ 14న మంగళూరులో జన్మించారు మార్గరేట్​ అల్వా. గోవా 17వ గవర్నర్​గా ఆమె విధులు నిర్వర్తించారు. గుజరాత్​కు 23వ గవర్నర్​గా, రాజస్థాన్​కు 20వ గవర్నర్​గా, ఉత్తరాఖండ్​కు 4వ గవర్నర్​గాను బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా.. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు 80ఏళ్ల అల్వా.

ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఆదివారం భేటీ అయ్యాయి విపక్షాలు. భేటీ అనంతరం.. మార్గరేట్​ అల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు శరద్​ పవార్​ ప్రకటించారు.

తదుపరి వ్యాసం