తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్‌కు మార్గం సుగమం..

Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్‌కు మార్గం సుగమం..

HT Telugu Desk HT Telugu

24 October 2022, 17:31 IST

google News
  • Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా పోటీపడుతున్న రిషి సునాక్‌గా మార్గం సుగమమైంది. కన్జర్వేటివ్ పార్టీలో మెజారిటీ ఎంపీలు ఆయనకు మద్దతుగా నిలిచారు.

Rishi Sunak: Rishi Sunak is seen.
Rishi Sunak: Rishi Sunak is seen. (AP)

Rishi Sunak: Rishi Sunak is seen.

అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సగానికి పైగా ఎంపీల మద్దతు ఉండడంతో రిషి సునాక్‌కు బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి దక్కనుందని యూకే మీడియా సంస్థలు నివేదించారు. పార్లమెంటరీ పార్టీలో సంపూర్ణ మెజారిటీకి అవసరమైన 179 మంది సభ్యుల మద్దతు కూడగట్టినట్టు నివేదించాయి.

ప్రధాన మంత్రి అభ్యర్థిత్వానికి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీపడతారని అంతా భావించిన నిన్న రాత్రి ఆయన వెనకడుగు వేశారు.

బ్రిటన్ భావి ప్రధానిగా అధికార పార్టీ ఎంపీల్లో సగానికి పైగా ఎంపీలు రిషీ సునాక్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారని యూకే మీడియా నివేదించింది.

ప్రస్తుతం ఆయనకు ఇప్పుడు ఒకే ఒక ప్రత్యర్థిగా ఉన్న పెన్నీ మోర్డాంట్ కేవలం 26 మంది మద్దతు కూడగట్టారు.

రిషి సునాక్‌కు దక్కిన మద్దతుదారుల సంఖ్య సింబాలిక్‌గా చాలా ముఖ్యమైన అంశం. జనరల్ ఎలక్షన్స్ కోసం డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆయనకు అధికార పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉందన్న సంకేతాలు వెలువడడం ఆయనకు కలిసొస్తుంది.

ప్రధాన మంత్రి అభ్యర్థిగా గతంలో లిజ్ ట్రస్‌తో పోటీపడి రిషి సునాక్ ఓడిపోయారు. ఒకవేళ పెన్నీ మోర్డాంట్ కన్జర్వేటివ్ పార్టీ నుంచి 100 మంది ఎంపీల మద్దతు కూడగట్టలేకపోతే తదుపరి ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికైనట్టు ప్రకటిస్తారు.

ప్రధానిగా ఎన్నికైతే భారత సంతతి గల వ్యక్తి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టిస్తారు.

టాపిక్

తదుపరి వ్యాసం